Begin typing your search above and press return to search.

కేంద్రంలో ని మ‌హిళా మంత్రుల‌ కు రెజ్ల‌ర్ల‌ సెగ‌.. ఏం జ‌రిగిందంటే!

By:  Tupaki Desk   |   31 May 2023 7:00 PM GMT
కేంద్రంలో ని మ‌హిళా మంత్రుల‌ కు రెజ్ల‌ర్ల‌ సెగ‌.. ఏం జ‌రిగిందంటే!
X
భార‌త రెజ్ల‌ర్ల సంఘం అధ్య‌క్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూష‌ణ్‌ కుమార్ లైంగిక వేధింపుల‌ కు పాల్ప‌డ్డారంటూ.. భార‌త రెజ్ల‌ర్ల సంఘం లోని మ‌హిళా రెజ్ల‌ర్లు, అదేవిధంగా పురుష రెజ్ల‌ర్లు కూడా.. తీవ్ర ఆందోళ‌న చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. వీరిలో మ‌హిళా రెజ్లర్ల‌ ను రెండు రోజ‌లు కింద‌ట జంత‌ర్‌మంత‌ర్ వద్ద పురుష పోలీసులు అత్యంత అవ‌మాన‌క‌ర రీతిలో ప్రైవేటు పార్ట్స్ వ‌ద్ద చేతులు వేసి మ‌రీ ఈడ్చుకెళ్లిన దృశ్యాలు మీడియా లో వ‌చ్చాయి.

ఈ ప‌రిణామాల‌ పై దేశ‌వ్యాప్తంగా మ‌హిళ‌లు ఉన్న‌త‌స్థాయిలో ఉన్న మ‌హిళ‌లు కూడా తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో కేంద్రంలో మ‌హిళా మంత్రులుగా ఉంటూ.. నిత్యం ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ భ‌జ‌న‌ లో ఆరితేరుతున్న‌వారు.. ఇప్పుడు క‌నీసం పెద‌వి విప్ప‌క‌పోవ‌డం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. సోష‌ల్ మీడియా వారి కేంద్రంగా నెటిజ‌న్లు నిప్పులు చెరుగుతున్నారు. సాటి మ‌హిళ‌లుగా కేంద్రంలో మంత్రులుగా ఉండి.. కూడా ఈ విష‌యాన్ని ప‌ట్టించుకోరా? అంటూ.. నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు.

ఒలింపిక్స్‌ వేది పై అద్భుతంగా రాణించి భరతమాత మెడలో పతకాలు వేసిన కుస్తీ వీరులు 40 రోజులుగా న్యాయం కోసం దేశ రాజధాని లో గళమెత్తినా పట్టించుకున్న నాథుడే లేడని నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు. భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ తమను లైంగికం గా వేధించాడంటూ రోడ్లపైకొచ్చి మరీ ఆందోళన చేస్తున్నారు.

సమస్యను పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఐదు నెలలుగా మౌనం దాల్చింది. ప్రభుత్వ తీరుతో విసుగు చెందిన రెజ్లర్లు నూతన పార్లమెంటు భవనం ముట్టడికి ప్రయత్నిస్తే.. పోలీసులు వారిని ఈడ్చిపడేశారు. దీంతో కలత చెందిన వారంతా తాము సాధించిన పతకాలకు విలువే లేదని, అందుకే వాటిని గంగానది లోకి విసిరేసి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. అయితే.. మ‌హిళా రెజ్లర్ల‌ కు క‌నీసం మ‌ద్ద‌తు తెలిపేందుకు కూడా.. కేంద్ర మ‌హిళా మంత్రులు ముందుకు రాక‌పోవ‌డం మ‌రింత‌గా విమ‌ర్శ‌ల‌కు దారితీయ‌డం గ‌మ‌నార్హం.