Begin typing your search above and press return to search.

కసాయి తల్లి.. రాసలీలలకు అడ్డు అని కొడుకును చంపింది

By:  Tupaki Desk   |   24 April 2020 5:00 AM IST
కసాయి తల్లి.. రాసలీలలకు అడ్డు అని కొడుకును చంపింది
X
సమాజంలో ఇలాంటి కసాయి తల్లులు కూడా ఉంటారని ఇలాంటి ఘటనలు చూశాకే అర్థమవుతుంది. ప్రియుడితో రాసలీలలకు అడ్డుగా ఉన్నాడని.. అభంశుభం తెలియని 6 ఏళ్ల కన్నబిడ్డను కడతేర్చింది ఓ కసాయి తల్లి. కన్నబిడ్డ కంటే తనకు పడక సుఖమే ముఖ్యమని చాటింది. ఇంతటి దుర్మార్గమైన ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో చోటుచేసుకుంది.

కోయంబత్తూరులోని కోవై, కోయిల్మేడు ప్రాంతానికి చెందిన దివ్య (30)కు కొన్నాళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తితో వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. అయితే గొడవల కారణంగా దివ్య భర్తతో విడిపోయింది. పిల్లలిద్దరిని తీసుకొని దివ్య తుడియలూరుకు మకాం మార్చింది.

అక్కడ దివ్యకు రాజదురై అనే స్థానిక యువకుడితో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరూ యథేచ్ఛగా శారీరకంగా కలుస్తూ ఎంజాయ్ చేసేవారు. ఇది చాలదన్నట్టు ఇక ఇద్దరూ ఓ ఇంటిని తీసుకొని సహజీవనం చేయసాగారు. లాక్ డౌన్ తో తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

ప్రియుడు రాజదురై రాగానే తన పిల్లలను దివ్య బయటకు పంపిస్తుంటుంది. మంగళవారం కూడా రాజదురై రాగా కొడుకు అభిషేక్ ను దివ్య బయటకు పంపింది. అయితే అభిషేక్ ఆకలితో ఏడ్వడం.. ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న దివ్యకు కోపం తెప్పించింది. బయటకు వచ్చి పిల్లాడిని చితకబాదింది. అభిషేక్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. 108లో ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయాడు. అనుమానం వచ్చిన 108 సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.. పోలీసుల విచారణలో తానే కొట్టానని చనిపోయాడని దివ్య తెలిపింది. బాయ్ ఫ్రెండ్ తో అక్రమ సంబంధాన్ని బయట పెట్టింది. దీంతో ఈ దారుణం వెలుగుచూసింది. పడక సుఖం కోసం కన్న కొడుకును చంపిన కసాయి తల్లి నిర్వాకం వెలుగుచూసింది.