Begin typing your search above and press return to search.

ప‌డక సుఖం అందిస్తేనే క‌డుపు నిండేది

By:  Tupaki Desk   |   28 Feb 2018 6:55 AM GMT
ప‌డక సుఖం అందిస్తేనే క‌డుపు నిండేది
X
సిరియాలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోతుంది. ఇప్పుడిప్పుడే ఐసిస్ నుంచి సిరియాకి విముక్తి క‌లుగుతున్నా..అక్క‌డి మ‌హిళ‌ల‌పై లైంగిక వేధింపులు కొన‌సాగుతున్నాయి. ఐసిస్ నుంచి ర‌క్ష‌ణ పొందేందుకు స‌హాయ కేంద్రాల‌కు త‌ర‌లివెళుతున్న‌మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న దారుణాల్ని క‌ళ్ల‌కు కట్టిన‌ట్లు చూపించే ప్ర‌య‌త్నం చేస్తుంది ఓ స‌ర్వే సంస్థ.

గ‌తంలో ఐసిస్ ఉగ్ర‌వాదులే ఇలాంటి ఆకృత్యాల‌కు పాల్పడ్డార‌ని విన్నాం. కానీ ఇప్ప‌డు స‌హ‌యక కేంద్రాల్లో ఆడ‌వాళ్ల‌పై జ‌రుగుతున్న ఆట‌విక దాడులు జ‌రుగుతుంటే వారి నుంచి ఎప్పుడు విముక్తి ల‌భిస్తుందా అని బాధితులు ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. సిరియాలో గవర్నర్ల పాలనలోని వివిధ ప్రాంతాల్లో మాన‌వత్వం పేరుతో కొన్ని స్వ‌చ్ఛంద సంస్థ‌లు మ‌హిళ‌ల్ని త‌మ కామ‌వాంఛ‌లు తీర్చుకునేలా విషం క‌క్కుతున్నార‌ని ఐరాస జనాభా నిధి (యూఎన్‌ ఎఫ్‌ పీఏ) చేసిన పరిశీలనలో తేలింది.

అంతేకాదు ఐసిస్ ఉగ్ర‌వాదుల నుంచి ర‌క్ష‌ణ పొందేందుకు అక్క‌డి మ‌హిళ‌లు స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు త‌ర‌లి వెళుతున్నారు. అయితే స్వ‌చ్ఛంద సంస్థ‌ల్లో త‌మ‌పై లైంగిక దాడులు జ‌రుగుతున్న‌ట్లు బాధితులు వాపోతున్నారు. సహ‌య కేంద్రాల్లో స‌హ‌యం పొందాలంటే వారికి ప‌డ‌క సుఖం అందించే దుర్భ‌ర ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని కొన్ని స‌ర్వే సంస్థ‌లు తెలిపాయి.

ఇదే విష‌యంపై ప్ర‌భుత్వాల‌కు మొర‌పెట్టుకున్నా ఫ‌లితం లేద‌ని కొంత‌మంది మ‌హిళ‌లు నేష‌న‌ల్ మీడియాకు చెప్పారు. మ‌రి లైంగిక వేధింపులు లేని స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు వెళ్లాల‌న్నా భ‌యం వేస్తుంద‌ని , అక్క‌డే ఇలాంటి ప‌రిస్థితి త‌లెత్తితే త‌మ‌జీవితం న‌ర‌క‌ప్రాయమేన‌ని క‌న్నీటి ప‌ర్యంత‌మ‌వుతున్నారు.

ఈ లైంగిక వాంఛ‌ల‌ గురించి తెలియ‌ని కొంత‌మంది యువ‌తుల్ని స్వ‌చ్ఛంద సంస్థ‌ల్లో ప‌నిచేసే వారు వారిని లోబ‌రుచుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. అనంత‌రం వారి వ‌ద్ద‌నుంచి ఫోన్ నెంబ‌ర్లు తీసుకొని ఇంటి వ‌ద్ద దింపుతున్నార‌ని , కోరిక క‌లిగిన‌ప్పుడు ఇంటికి వెళుతున్నార‌ని , లేని ప‌క్షంలో భ‌య‌బ్రాంతుల‌కు గురి చేస్తున్న‌ట్లు వాయిస్ ఫ్రం సిరియా 2018 నివేదిక వెల్లడించింది.

ఇక పెళ్లై భ‌ర్త‌ను కోల్పోయిన వారి ప‌రిస్థితి దారుణ‌మని చెప్పింది. నెల‌ల త‌ర‌బ‌డి వారి కోరిక‌లు తీర్చుకొని వ‌దిలేస్తున్నార‌ని తెలిపింది. ఈ ఆకృత్యాలు దారా - క్యునీత్ర తదితర ప్రాంతాల్లో జ‌రిగిన‌ట్లు స్వచ్ఛంద సహాయ సలహాదారు డానియల్‌ స్పెన్సర్‌ తెలిపారు.