Begin typing your search above and press return to search.

కరోనా భాద తొలగడానికి 500 మంది అమ్మవారికి ..వీడియో వైరల్ !

By:  Tupaki Desk   |   6 May 2021 11:18 AM IST
కరోనా భాద తొలగడానికి 500 మంది అమ్మవారికి ..వీడియో వైరల్ !
X
దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. మొదటి వేవ్ తో పోలిస్తే ఈ సెకండ్ వేవ్ లో ఎక్కువగా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ఆందోళన పెరిగిపోతుంది. అలాగే దేశంలో ఆక్సిజన్ కొరత కూడా తీవ్రంగా వేధిస్తుంది. దీనితో ప్రజలు గుంపులు గుంపులుగా తిరగడాన్ని నిషేదించారు. చాలా రాష్ట్రాలు ఇప్పటికే లాక్ డౌన్ , కర్ఫ్యూ అంటూ కరోనా కట్టడి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కానీ, తాజాగా గుజరాత్ లో జరిగిన ఓ సంఘటన దేశంలో కరోనా మళ్లీ పెరగడానికి కారణం ఇలాంటి ఘటనలే కదా అని అనిపిస్తుంది. కరోనా అంతం కావాలని ఆ అమ్మవారికి దాదాపుగా 500 మందికి పైగా మహిళలు గుమ్మిగూడి బోనం సమర్పించారు. కరోనా సమయంలో 500 మంది గుమ్మిగూడటం తో ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది. ఈ వీడియో బయటకి వచ్చిన వెంటనే సంబంధిత అధికారులు ... ఆ గ్రామ సర్పంచ్ తో పాటుగా మొత్తం 23 మందిపై కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే .. దాదాపుగా 500 మందికి పైగా మహిళలు అహ్మదాబాద్ జిల్లా నవపుర అనే గ్రామంలో బలియదేవ్ ఆలయంలో ప్రార్థనలు చేయడానికి గుమ్మిగూడారు. తలపై నీటి కుండలు తీసుకొని వారంతా ఆలయం వైపు నడుస్తున్నారు. అయితే , ఆ వీడియోలో ఏ ఒక్కరూ కూడా మాస్కులు ధరించకపోవడం గమనార్హం. అలాగే అదే వీడియోలో చాలా మంది పురుషులు కూడా ఉన్నారు మరియు వారు కూడా కరోనా నియమాలని పాటించలేదు. ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవ్వడంతో అహ్మదాబాద్ గ్రామీణ పోలీసులు వారిపై తగిన చర్యలు తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బలియదేవ్ ఆలయంలో నీరు పోస్తే కరోనావైరస్ పోతుందని గ్రామస్తులు విశ్వసించి , పెద్ద సంఖ్యలో గుమ్ముగూడి అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు 23 మంది గ్రామస్తులు, సర్పంచ్ గఫాభాయ్ ఠాకూర్‌ ను అరెస్టు చేసినట్టు సనంద్ డివిజన్ డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్, కె.టి.కమరియా మీడియాతో తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 188 మరియు విపత్తు నిర్వహణ చట్టం మరియు అంటువ్యాధుల వ్యాధుల చట్టం ప్రకారం బహిరంగ సభలకు సంబంధించి పోలీసు నోటిఫికేషన్‌ ను ఉల్లంఘించినందుకు వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.