Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ : బీరు బాటిల్ చూసి కళ్లు తిరిగిపడిపోయిన యువతి..ఎందుకో తెలుసా ?

By:  Tupaki Desk   |   5 May 2020 12:00 AM IST
లాక్ డౌన్ : బీరు బాటిల్ చూసి కళ్లు తిరిగిపడిపోయిన యువతి..ఎందుకో తెలుసా ?
X
కరోనా వైరస్ కట్టడి కోసం దేశం మొత్తం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. రెండో విడత లాక్ డౌన్ గడువు ఆదివారం అర్దరాత్రితో ముగిసింది. మూడో విడత లాక్ డౌన్ ఈనెల 17వ తేదీ వరకు పొడగించారు. అయితే మద్యం విక్రయాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దీనితో నేటి ఉదయం నుండి దేశవ్యాప్తంగా వైన్ షాపుల ముందు మందుబాబులు క్యూ కట్టారు. పురుషుల కంటే మేమేం తక్కువ అంటూ కొన్నిచోట్ల యువతులు, మహిళలు బ్రాందీ షాపుల ముందు క్యూ కట్టారు. బెంగళూరు నగరంలోని ఓ బ్రాందీ షాప్ ముందు క్యూలో నిలబడిన యువతి లిక్కర్ తాగక ముందే బీరు బాటిల్ చూసి కళ్లు తిరిగి కుప్పకూలిపోయింది.

దీనితో ఆ యువతీ ఏమైంది అంటూ అక్కడున్నవారందరు, పోలీసులు ఆరా తియ్యగా ఆ మహాతల్లి చెప్పిన సమాధానం విని పోలీసులతో పాటుగా , అక్కడున్న వారు కూడా షాక్ అయ్యారు. ఇంతకీ ఆ యువతీ ఏం చెప్పిందంటే ..? పూర్తీ వివరాలు చూస్తే ..

బెంగళూరులోని ఎంజీ రోడ్డులోని టానిక్ వైన్ షాప్ ఉంది. సోమవారం ఉదయం నుంచి ఎంజీ రోడ్డులోని టానిక్ వైన్ షాప్ ముందు మద్యం కొనుగోలు చెయ్యడానికి వందల మంది క్యూలో నిలబడి ఉన్నారు. మందుబాబులు నిలబడిన క్యూ లైన్ లో కొందరు యువతులు నిలబడి ఉన్నారు. క్యూ లైన్ ముందుకు కదులుతున్న సమయంలో అక్కడ ఉన్న ఓ యువతి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. టానిక్ వైన్ షాప్ ముందు క్యూలో నిలబడి ఉన్న మందుబాబులు, అక్కడ ఉన్న పోలీసులు యువతి కింద పడిపోయిన విషయం గుర్తించారు. వెంటనే ఓ కుర్చిలో ఆ యువతిని కుర్చోబెట్టారు. సమీపంలోని ఓ షాప్ లో మంచినీళ్ల బాటిల్ తీసుకు వచ్చి ఆయువతితో తాగించారు. అమ్మా, ఏం జరిగింది , ఎందుకు పడిపోయావు అంటూ అక్కడ ఉన్న వాళ్లు ప్రశ్నించారు

ఆ యువతీ మాట్లాడుతూ ..40 రోజుల నుంచి లిక్కర్ షాప్ లు, పబ్ లు, బార్ అండ్ రెస్టారెంట్లు మూతపడిన విషయం తెలిసిందే. సోమవారం నుంచి మద్యం విక్రయిస్తారని మాకు తెలిసిందని, ఎక్కడ మద్యం చిక్కుతుందో ..లేదో అని భయంతో టిఫిన్ కూడా చెయ్యకుండా వేకువ జామున స్నేహితులతో కలిసి క్యూలైన్ లో నిలబడ్డానని, అందుకే తనకు కళ్లు తిరిగాయని ఆ యువతి సమాధానం చెప్పడంతో మందుబాబులు షాక్ కు గురైయ్యారు. అమ్మా తల్లి నీకు మందు అంత అవసరమా అంటూ పోలీసులు, మందుబాబులు యువతిని ప్రశ్నించారు. ఇంత జరిగినా ఆ యువతి కొంచెం కోలుకున్న తరువాత మళ్లీ టానిక్ వైన్ షాప్ ముందు క్యూలో నిలబడటంతో మందుబాబులకు మరోసారి కళ్లు తిరిగిపోయాయి.