Begin typing your search above and press return to search.
మహిళా గ్యాంగ్ దొంగతనాలతో హడల్
By: Tupaki Desk | 14 Nov 2020 11:15 AM ISTమగాళ్లు దొంగతనాలు చేసే రోజులు పోయాయి. ఇప్పుడు ఆడవాళ్లు కూడా రంగంలోకి దిగారు. ఆధ్యాత్మికనగరం తిరుపతిలో దొంగల ముఠా రెచ్చిపోయింది. రాజస్థాన్, బీహార్ కు చెందిన దొంగల ముఠా నగరంలోని వివిధ షాపుల్లో దొంగతనాలు చేస్తోంది.
దానం చేయండి అంటూ లోపలికి వచ్చి షాపు యజమానిని ఏమార్చి డబ్బులు దోచేస్తున్న వైనం వెలుగుచూసింది. పిల్లలతో కలిసి వస్తున్న ఈ ముఠా దొంగతనాలు చాకచక్యంగా చేసిన వైనం విస్తుగొలిపింది.
తాజాగా వీరు దొంగతనం చేస్తుండగా ఓ షాపులోని సీసీ టీవీల్లో వీడియో రికార్డ్ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ముసుగు వేసుకొని వస్తున్న ఈ ముఠా నగరంలోని అన్ని షాపులకు వెళుతున్నట్టు పోలీసులు కనిపెట్టారు. దీంతో నగరంలోని షాపులను అలర్ట్ చేశారు. దానం చేయండి అంటూ వచ్చిన వారిపై సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. నగరంలోని లక్ష్మీ స్టీల్, సప్తగిరి ఎలక్ట్రానిక్స్ షాపుల్లో ఈ ముఠా ఇప్పటికే చోరీకి పాల్పడింది.