Begin typing your search above and press return to search.
ఎన్డీయే పరీక్షకు మహిళలు..సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
By: Tupaki Desk | 18 Aug 2021 5:00 PM ISTనేషనల్ డిఫెన్స్ అకాడమీ లో మహిళలో ప్రవేశానికి సంబంధించి దేశ అత్యన్నత న్యాయస్థానం సుప్రీకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తుది తీర్పునకు లోబడే ఎన్డీయే ప్రవేశాలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ సంజయ్ కిషన్, రిషికేశ్ రాయ్ నేతృత్వంలోని డివిజనల్ బెంచ్ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచసింది. ఎన్డీయే పరీక్షకు మహిళలను అనుమతించక పోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విధాన నిర్ణయం ప్రకారమే మహిళలను ఎన్డీయే పరీక్షకు అనుమతించలేదని ఇండియన్ ఆర్మీ సుప్రీంకోర్టుకు తెలిపింది.
అయితే, లింగ వివక్ష ఆధారంగా విధానపరమైన నిర్ణయం ఉందని.. ఇది సరికాదని కోర్టు అక్షింతలు వేసింది. కాగా, సెప్టెంబరు 5న ఎన్డీయే పరీక్ష జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఎన్డీయే పరీక్షకు మహిళలను అనుమతిస్తూ ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎన్డీయే పరీక్షలకు మహిళలకు అనుమతించాలని కోరుతూ కుష్ కర్లా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. మహిళలను ఎన్డీయే పరీక్షకు అనుమతించకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 16, 19ని ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు.
నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ తీసుకొని సాయుధ బలగాల్లో చేరి.. దేశానికి సేవ చేయాలని ఎంతో మంది అర్హత కలిగిన, ఔత్సాహిక మహిళలు భావిస్తున్నారని పిటిషన్ లో తెలిపారు. కానీ లింగ వివక్షతో వారి హక్కులను కాల రాస్తున్నారని పిటిషన్ ఆవేదన వ్యక్తం చేశారు. పురుషులతో పాటు మహిళలకు సమాన హక్కులను కల్పించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు సెప్టెంబరు 5న జరగబోయే ఎన్డీయే పరీక్షకు మహిళలను కూడా అనుమతించాని స్పష్టం చేసింది.
అదే సమయంలో ఎన్‌డిఎ పరీక్షను రాయాలి అనుకుంటున్న బాలికలను మధ్యంతర చర్యల్లో భాగంగా తీసుకోవాలని కోర్టు అనుమతించింది. సెప్టెంబర్ 5 న ఎన్‌డిఎలో బాలికల ప్రవేశ సమస్యను ఒక విధానంగా పరిగణిస్తాము, అని సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ ఎస్ కె కౌల్ మరియు హృషికేష్ రాయ్ వెల్లడించారు. బాలికలు, మహిళా అభ్యర్థులపై నిరంతర లింగ వివక్ష పై భారత సైన్యంపై బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళల విషయంలో భారత నావికాదళం మరియు వైమానిక దళం ఇప్పటికే ఏర్పాట్లు చేసినప్పటికీ, భారత సైన్యం ఇంకా వెనుకబడి ఉందని చెప్పారు.
ఇప్పటివరకు మహిళల ప్రవేశానికి శాశ్వత కమిషన్ ఏర్పాటు చెయ్యలేదని, సుప్రీంకోర్టు మెట్లు ఎక్కే వరకు మహిళల అంశాన్ని చట్టం లోనూ, ఇతర విభాగాల్లోనూ చేర్చలేదని ధర్మాసనం ఇండియన్ ఆర్మీ అని ప్రశ్నించింది. ఇది మార్పులేని మీ మనస్తత్వానికి అద్దం పడుతుందని కోర్టు ఇండియన్ ఆర్మీ ని తప్పు పట్టింది. కోర్టు ఆదేశాలకు లోబడి అడ్మిషన్లు ఉంటాయని తన తీర్పులో తెలిపింది. ఆర్మీకి సంబంధించిన సైనిక పాఠశాలలలో కొన్ని విభాగాల్లో బాలికలకు ప్రవేశం లేదు. కేవలం బాలురు మాత్రమే ఎన్డీఏ పరీక్షలు రాసి ప్రవేశాలు పొందడానికి అర్హులు. అయితే ఈ క్రమంలో ఎన్డీఏ పరీక్ష రాసి ఆర్మీ స్కూల్స్ లో చదువుకోవాలి అనుకుంటున్న బాలికలు కోర్టును ఆశ్రయించడంతో ఆర్మీ లో లింగ వివక్ష పై సుప్రీం ధర్మాసనం ఇండియన్ ఆర్మీ పై ఆగ్రహం వ్యక్తం చేసింది