Begin typing your search above and press return to search.
ఆన్ లైన్ లో మహిళా డాక్టర్లకు కొత్త తరహా తిప్పలు
By: Tupaki Desk | 30 Dec 2020 6:00 AM ISTరోగం వస్తే ఆసుపత్రికి పరుగులు తీస్తాం. వైద్యుడు మగ.. ఆడ అన్న తేడా లేకుండా వైద్య సాయం కోరతాం. కానీ.. ఈ విషయంలోనూ కొందరు అతిగాళ్లు చేస్తున్న వికార చేష్టలు మహిళా డాక్టర్లకు కొత్త సమస్యల్ని తెచ్చి పెడుతున్నాయి. మహమ్మారి పుణ్యమా అని.. ఆసుపత్రులకు వెళ్లే బదులు.. ఇంట్లో నుంచి ఆన్ లైన్ లోనే వైద్యులతో కన్సల్టేషన్ పొందే సౌకర్యాన్ని పలు వెబ్ సైట్లు కల్పిస్తున్నాయి. వీటిని.. కొందరు అతిగాళ్లు తమ పైత్యాన్ని ప్రదర్శించుకునేందుకు అవకాశంగా మార్చుకుంటున్న కొత్త నిజం బయటకు వచ్చింది.
వైద్య సాయం కోసం స్లాట్లు బుక్ చేసుకునే కొందరు.. మహిళా వైద్యులు ఆన్ లైన్ లోకి వచ్చినంతనే.. వారి ముందే హస్త ప్రయోగం చేయటం.. అసభ్యకరమైన సంభాషణలు చేయటం లాంటివి చేస్తున్న వైనం ఇప్పుడు బయటకు వచ్చింది. టెలి మెడిసిన్ సలహాలపై ప్రభుత్వ మార్గదర్శకాల్ని అటు వెబ్ సైట్లు.. ఇటు రోగులు అనుసరించటం లేదు. అంతేకాదు.. మహిళా డాక్టర్లను వేధించే కొందరు రోగులు వేర్వేరు ఐడీ నెంబర్లతో పేర్లను నమోదు చేసుకుంటున్నారు. ఇలాంటి అతిగాళ్ల కారణంగా డాక్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారిపై పోలీసులకు ఫిర్యాదులు ఇవ్వాలని సైట్లనను కోరుతున్నా.. వారు పట్టించుకోవటం లేదన్న విమర్శ వినిపిస్తోంది.
కొన్ని వెబ్ సైట్లు.. యాప్ లు.. తమ మధ్య సభ్యత్వం తీసుకున్న వారికి అన్ లిమిటెడ్ ఫ్రీ కన్సల్టేషన్ ను అందిస్తున్నారు. మరికొందరికి రోజుకు పరిమిత సంఖ్యలో ఉచిత కన్సల్టేషన్ అందుబాటులోకి ఉంచుతున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుంటున్న వారు.. రాత్రిళ్లు మహిళా డాక్టర్లను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో.. మహిళా డాక్టర్లు రాత్రివేళలో కన్సల్టేషన్లకు ఆసక్తి చూపటం లేదు. ఆ సమయంలో పురుష వైద్యుల్ని నియమించాలని కోరుతున్నాయి. ఈ తరహా వేధింపులు ఇటీవల కాలంలో ఎక్కువైనట్లుగాచెబుతున్నారు. అయితే.. ఇలాంటి చేష్టలకు పాల్పడే వారిని గుర్తించి.. వారి ఐడీని బ్లాక్ చేయటం లాంటి కఠిన చర్యలు తీసుకోవటం.. పోలీసులకు ఫిర్యాదు చేయటం ద్వారా కట్టడి చేయొచ్చని చెబుతున్నారు. అయితే.. ఇలాంటివేమీ సదరు సైట్లు చేయటం లేదంటున్నారు.