Begin typing your search above and press return to search.
మావోల పనిపట్టేందుకు మహిళా కమాండోలు
By: Tupaki Desk | 18 July 2015 12:19 PM ISTమహిళలు అడుగుపెట్టని రంగం లేదు... వారు సాధించని విజయం లేదు.. తాజాగా మావోయిస్టుల ఏరివేతకు కూడా మహిళా కమాండోలు తొలిసారి రంగంలోకి దిగనున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని తొలిసారిగా మవోయిస్టు ఏరివేతకు మహిళా కమాండర్‌లు రంగంలోకి దిగనున్నారు. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకర్ జిల్లాలోని 'కౌంటర్ టెరర్రిజం జంగిల్ వార్‌ఫేర్ కాలేజీ' (సీటీజేడబ్లూసీ)లో మహిళల శిక్షణకు శ్రీకారం చుట్టింది. ఈ కాలేజీలో గత ఫిబ్రవరి 28వ తేదీన 44 మంది మహిళలు అన్ని రకాల యుద్ధవిద్యల్లో ఆరితేరి కమాండోలుగా సర్టిఫికేట్లు అందుకున్నారు. నదీనదాలు దాటి కొండలు, గుట్టలు ఎక్కి ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా గెరిల్లా పోరాటాలకు కఠిన శిక్షణను పూర్తిచేశారు. మగ కమాండోలకు ధీటుగా తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తున్నారు. కమాండో శిక్షణ పొందిన మహిళలను ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని మావోయిస్టు ప్రాబల్య, ప్రభావిత ప్రాంతాల్లో నియమిస్తారట.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మొత్తం 27 జిల్లాలున్నాయి. వీటిలో 16 జిల్లాల్లో నక్సల్ ప్రాబల్యం అధికంగా ఉంది. మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకుడు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి చత్తీస్‌గఢ్‌లో ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. మావోయిస్టుల్లో మహిళల సంఖ్య ఎక్కువే... మరోవైపు కేంద్ర కమిటీ నేత గణపతి చుట్టూ ఉండే రక్షణ వలయం కూడా పూర్తిగా మహిళా మావోయిస్టులతోనే ఉంటుది. ఈ నేపథ్యంలో వారికి ధీటుగా భద్రతాబలగాలు కూడా మహిళలనే రంగంలోకి దించుతున్నాయి. సరిహద్దుల్లోనూ మహిళా సైనికులు ఉన్నప్పటికీ మావోయిస్టుల ఏరివేత చర్యలు అంతకంటే భిన్నమైనవని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలిసారి ఈ పనిలో నియమితులైన ఈ 44 మంది యువతులు సాహసనారులే కానున్నారు.