Begin typing your search above and press return to search.

ప్రముఖుల భద్రతకు మహిళా కమాండోలు

By:  Tupaki Desk   |   23 Dec 2021 11:00 AM IST
ప్రముఖుల భద్రతకు మహిళా కమాండోలు
X
అవును మొదటిసారిగా ప్రముఖుల భ్రదతలో మహిళా కమాండోలు కూడా ఉండబోతున్నారు. దేశంలోనే మొదటిసారిగా భద్రతా దళాల బాధ్యతల్లో మహిళలను కూడా నియమించాలని కేంద్రప్రభుత్వం డిసైడ్ చేసింది. డిసైడ్ చేయటమే కాకుండా 32 మంది మహిళా సీఆర్పీఎఫ్ కమాండోలకు ఉన్నతాధికారులు అవసరమైన శిక్షణ కూడా ఇప్పించారు.

భద్రతా విధులకు అవసరమైన కఠినమైన శిక్షణ కోసం ఉన్నతాధికారులు 32 మంది మొదటి బ్యాచ్ గా ఎంపికచేశారు. వీరందరికీ ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్ ఆధ్వర్యంలో అవసరమైన శిక్షణి ఇప్పించారు. వీరి కఠిన శిక్షణ దాదాపు 10 వారాలు జరిగింది. దాంతో వివీఐపీలకు పూర్తిగా భద్రతా బాధ్యతలు నిర్వర్తించేందుకు ఈ 32 మంది మహిలా కమాండోలు నూరుశాతం రెడీగా ఉన్నారు.

మొదటి బ్యాచ్ కమాండోలను సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు కేంద్ర హోంశాఖ మంత్ర అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధి, రాహుల్ గాంధి, ప్రియాంకగాంధి, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దంపతులతో పాటు మరికొందరు ప్రముఖులకు కేటాయించబోతున్నారు. ముందుగా వీరి భద్రతను ఢిల్లీలోని జడ్ + భద్రత ఉన్న అత్యంత ప్రముఖులకు మాత్రమే పరిమితం చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.

తొందరలో జరగబోయే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయనున్న పై ప్రముఖులకు మహిళా కమాండోలు బాధ్యతలు స్వీకరించబోతున్నారు. వీళ్ళపనితీరును చూసిన తర్వాత వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా మరింతమంద మహిళా కమాండోలకు ఐటీబీఎఫ్ లో కఠిన శిక్షణకు ఉన్నతాధికారులు ప్లాన్ చేస్తున్నారు. చాలా దేశాల్లో ఇప్పటికే ప్రముఖులకు మహిళా కమాండోలను భద్రతా టీముల్లో నియమించుకుంటున్న విషయం మనం చూస్తున్నదే.