Begin typing your search above and press return to search.

పెళ్లి వద్దంటున్న యువత.. కెరీర్ కే ఫస్ట్ ప్రిఫెరెన్స్

By:  Tupaki Desk   |   15 Nov 2020 6:00 AM IST
పెళ్లి వద్దంటున్న యువత.. కెరీర్ కే ఫస్ట్ ప్రిఫెరెన్స్
X
ఆడవాళ్లు వంటింటి కుందేళ్లు’ అని స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో అనేవారు. 70వ దశకం వరకు మహిళలు పెద్దగా బయటకు రాలేదు. తర్వాత లేచింది మహిళా లోకం అని పిలుపునివ్వగానే అన్నిరంగాల్లోకి వచ్చేశారు. ఆధునికత, అభివృద్ధి, సమాజంలో మార్పులతో ఇప్పుడు మగవారికి ధీటుగా ఆడవారు రాణిస్తున్నారు. ఉన్నత పదవులు అలంకరిస్తున్నారు. ఈ క్రమంలోనే అమ్మాయిలు పెళ్లిపై కంటే కెరీర్ పైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. తమ కాళ్లపై తాము నిలబడ్డాకే పెళ్లి చేసుకోవాలని ఆశిస్తున్నారు. ఎవరీ వద్ద చేయి చాపకుండా బ్రతుకాలని అమ్మాయిలు ఆలోచిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో భార్యభర్తలు ఇద్దరు సంపాదిస్తే ఇళ్లు గడుస్తుంది. దీంతో అబ్బాయిలు సైతం ఉద్యోగాలు చేసే అమ్మాయిలనే పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఈ కారణంగానే ఆడవాళ్ల వివాహా వయస్సు క్రమంగా పెరిగిపోతుందని తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తల్లిదండ్రులు సైతం అమ్మాయిల పెళ్లి కంటే చదువు.. కెరీర్ పైనే దృష్టి పెడుతున్నారు. దీంతో ఆడపిల్లల వివాహా వయస్సు క్రమంగా పెరిగిపోతుందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధ్యయనంలో తేలింది. దశాబ్ద కాలం క్రితం వ‌రకు ఆడ‌పిల్లల స‌గ‌టు వివాహ వ‌య‌స్సు 18-20 ఏళ్ల మధ్యలో ఉండేది. కానీ ఇప్పుడు 21ఏళ్లు దాటిన తర్వాతే మెజార్టీ అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నట్లు వెల్లడైంది.

2006లో దేశవ్యాప్తంగా యువతుల సగటు వివాహ వయస్సు 20.5 ఏళ్లుగా ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 19.5 ఏళ్లే ఉండేది. ఇప్పుడది తెలంగాణలో ఆడపిల్లల వివాహ సగటు వయస్సు 22 ఏళ్లకు చేరింది. గ్రామీణ యువతుల సగటు వివాహా వయస్సు 19.2నుంచి 21.6 ఏళ్లకు పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో అమ్మాయిల సగటు వ‌య‌స్సు 20.6 నుంచి 22.8 ఏళ్లకు చేరింది. ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2006లో 10.2శాతం మంది ఆడపిల్లలకు 18 ఏళ్లలోపే వివాహాలు జరుగగా ఇప్పుడు ఆ వయస్సులో వివాహాలు 1.9శాతానికి త‌గ్గినట్లు వెల్లడైంది.

ఒకప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నా.. నేటి సమాజంలో మాత్రం ఆడవాళ్లతోపాటు.. మగవాళ్ల ఆలోచనలో మార్పు వచ్చినట్లు స్పష్టంగా కన్పిస్తోంది. ఆడపిల్ల పుట్టిందంటే ఒకప్పుడు తల్లిదండ్రులు భారంగా భావించేవారు.. పిల్ల పెద్దమనిషి అయిందంటే పెళ్లి చేసి పంపించేందుకే మొగ్గుచూపేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఆడపిల్లలు కూడా మగవాళ్లతో సమానంగా చదువుల్లో.. ఉద్యోగాల్లో రాణిస్తూ ఆర్థికంగా కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. అందుకే అమ్మాయిలకు స్వేచ్ఛనిస్తూ వారిని ఎదగినిస్తూ తల్లిదండ్రులు పోత్సహిస్తున్నారు. దాంతో అమ్మాయిల వివాహ వయసు కూడా పెరిగిపోతోంది.