Begin typing your search above and press return to search.

చేతి మీద జగన్ పచ్చ బొట్టు.. ఇప్పుడు ఏమి అంటుండో..

By:  Tupaki Desk   |   2 Dec 2021 9:38 AM IST
చేతి మీద జగన్ పచ్చ బొట్టు.. ఇప్పుడు ఏమి అంటుండో..
X
ఎన్నికల సమయంలో అక్కా, చెల్లెమ్మా అంటూ ఓట్లు అడుగుతుంటే.. అన్నలా ఆదుకుంటావని అనుకున్నామని, కానీ గెలిచాక అన్ని విషయాల్లో మోసం చేస్తున్నాడని.. సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై మహిళలు మండిపడ్డారు. జగన్ అంటే అభిమానంతో చేతి మీది పట్టబొట్టు కూడా వేసుకున్నామని, కానీ ఇప్పుడు బాధపడుతున్నామంటూ తమ గోడు వెల్లబోసుకున్నారు. తమ ఉద్యోగాలను రెగ్యలరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ టీటీడీ సొసైటీ, కాంట్రాక్ట్ కార్మికులు తిరుపతిలో నిరసన చేపట్టారు. వారం రోజులుగా దీక్ష చేపడుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

తిరుపతిలో టీటీడీ సొసైటీ, కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనకు దిగారు. టీటీడీలో పనిచేస్తున్న సొసైటీ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులను కార్పొరేషన్లో విలీనం చేయాలని కోరుతున్నారు. బుధవారం వేలాది మంది కార్మికులు తిరుపతిలోని టీడీపీ పారిపాలనా భవనం దగ్గర నిరసన దీక్షలు చేపట్టారు. వారం రోజులుగా కార్మికులు వివిధ రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్ద కాలానికి పైగా పనిచేస్తున్న చేస్తున్నామని చెబుతున్నారు. అయినా తమ గోడును పట్టించుకునే నాథుడే లేడని వాపోతున్నారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఐదురోజులుగా ఆందోళనలు చేస్తున్నారు.

నిరసనలో పాల్గొన్న ఓ మహిళ చేతిపై జగన్‌ పట్టబొట్టు ఉంది. ఆమె మాట్లాడుతూ జగన్‌కు తాను వీరాభిమాని అని.. ఆ అభిమానంతోనే చేతిపై పచ్చబొట్టు వేయించుకున్నానని చెప్పింది. జగన్ అధికారంలోకి రావాలని తమ వంతుగా ఎంతో శ్రమించామని, అయితే అధికారంలోకి వచ్చిన జగన్.. మహిళలను మోసం చేస్తున్నారని మండిపడింది. తన చేతిపై ఉన్న పచ్చబొట్టుకు తన బాధనంతా చెప్పుకొంది. అనవరంగా ఓటు వేశామని ఇప్పుడు బాధ పడుతున్నామని పేర్కొన్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకూ దీక్ష విరమించేది లేదని భీష్మించుకున్నారు. న్యాయంగా పోరాడుతున్నామని, తాము ఎవరికీ భయపడేది లేదని హెచ్చరిస్తున్నారు. అనవసరంగా వైసీపీకి ఓటు వేశామని కార్మికులు వాపోతున్నారు.