Begin typing your search above and press return to search.

టాప్ లెస్ స్వేచ్ఛ కోసం రోడ్డెక్కారు

By:  Tupaki Desk   |   25 Aug 2015 4:31 AM GMT
టాప్ లెస్ స్వేచ్ఛ కోసం రోడ్డెక్కారు
X
పురుషులు.. స్త్రీలు సమానమేనంటూ నిరసనలు.. ఆందోళనలు చేయటం ఎంతో కాలంగా సాగుతున్నదే. అన్నింటా మగాళ్లతో సమాన హక్కులు కోరుతున్న మహిళలు.. ఆదివారం చిత్రమైన నిరసనలు చేపట్టి అందరి దృష్టిని ఆకర్షించారు.

మగవాళ్లు తమ ఛాతీని.. తమ నిప్పుల్స్ ను ప్రదర్శిస్తే లేని తప్పు.. ఆడోళ్లు చూపిస్తే తప్పేంటన్నది ఈ ఆందోళన ప్రధానాంశం. బొడ్డు పై భాగం నుంచి తలకాయ వరకూ పురుషులు అన్ని విప్పేసి తిరుగుతుంటే ఫర్లేదు కానీ.. ఆడోళ్లు మాత్రం వాటిని దాచుకొని తిరగాల్సిన పరిస్థితిపై తాజా నిరసన చేపట్టారు. ప్రపంచ వ్యాప్తంగా 60 నగరాల్లో ఇలాంటి నిరసనను చేపట్టారు. ఈ సందర్భంగా వారంతా బొడ్డు పై భాగంలో ఎలాంటి అచ్ఛాదన లేకుండా రోడ్ల మీదకు వచ్చేసి.. తమకు ఆ స్వేచ్ఛ ఉండాలని నినదించారు.

వారు అలా రోడ్ల మీదకు వస్తే.. వారి వెనుక మగాళ్లు కూడా.. మహిళలకు అలాంటి స్వేచ్ఛ ఇవ్వాలంటూ నినాదాలు చేయటం గమనార్హం. ప్లకార్డులు పట్టుకొని.. వీపు భాగంగా నినాదాలు రాసుకొని తమ వాణిని వినిపించారు. ఈ నిరసనలో పిల్లలు మొదలుకొని పండుముసలి బామ్మల వరకూ పాల్గొనటం ఒక విశేషం.

ఇక.. అమెరికాలోని పలు నగరాల్లో జరిగిన ఈ నిరసన ప్రదర్శనలకు.. న్యూయార్క్ ప్రఖ్యాత టైమ్ స్వ్కేర్ వద్ద నిరసన అక్కర్లేదంటూ స్థానిక మేయర్ ఆర్డరేశారు. ఎందుకంటే.. 1992 నుంచే న్యూయార్క్ నగరంలో టాప్ లెస్ గా మహిళలు తిరిగే స్వేచ్ఛ అధికారికంగా ఉంది. అయితే.. ఉద్యమకర్తలు మాత్రం ఇలాంటివేమీ పట్టించుకోకుండా టైమ్ స్వ్కేర్ వద్ద ఆందోళన చేయటాన్ని విమర్శిస్తున్నారు. మరి.. టాప్ లెస్ డిమాండ్ పై అమెరికా సహా మిగిలిన ప్రాశ్చాత్య దేశాలు ఎలా స్పందిస్తాయో..?