Begin typing your search above and press return to search.

ట్రైన్ దూసుకెళున్తా.. ఫోన్లో మాట్లాడుతూనే ఉన్న యువతి.. వైరల్..!

By:  Tupaki Desk   |   30 Nov 2022 6:29 AM GMT
ట్రైన్ దూసుకెళున్తా.. ఫోన్లో మాట్లాడుతూనే ఉన్న యువతి.. వైరల్..!
X
పట్టాలు దాటుతున్న ఎదురుగా ట్రైన్ వస్తే ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి.. మనమైతే పక్కకు తప్పుకోవడమో లేదంటే.. ట్రైన్ కంటే ముందుగానే పట్టాలు దాటేసి అటువైపు వెళ్లడమో చేస్తాం.. అంతే కదా.. కానీ ఓ యువతి చేసిన పని మాత్రం అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ ఐపీఎస్ అధికారి తన ట్విట్టర్లో పోస్టు చేయగా నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

ఇంతకీ ఆ యువతి ఏం చేసిందనే కదా.. మీ అనుమానం? అది తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తి చదవాల్సిందే..! హర్యానాలోని రోహతక్ లో ఓ యువతి ఫోన్ మాట్లాడుతూ రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నించింది. ఆమెకు అడుగు దూరంలోనే రైల్వే ప్లాట్ ఫాం ఉంది. ఈ క్రమంలోనూ అటు నుంచి ఓ గూడ్స్ రైలు వస్తుంది.

ఇలాంటి సమయంలో మనమైతే ఫోన్ పక్కనపెట్టి రైలు వచ్చేలోపే ఫ్లాట్ ఫాం పైకి చేరుకుంటాం. కానీ ఆ యువతి మాత్రం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఫోన్ మాట్లాడుతూనే ఉండటం గమనార్హం. ఇక ఆ యువతి ఫ్లాట్ ఫాం ఎక్కే సమయం లేకపోవడంతో పట్టాల మధ్యలోనే పడుకొని పోయింది.

విచిత్రం ఏంటంటే ఆ పరిస్థితి ఆ యువతి ఫోన్ ను మాత్రం వదిలిపెట్టలేదు. తనపై నుంచి రైలు వెళ్లిన తర్వాత తాపీగా పైకి లేస్తూ ఫోన్ మాట్లాడుతూనే ఉంది. రెప్పపాటులో మృత్యువును తప్పించుకున్న ఆ యువతి తనకేమీ జరగనట్టుగా తాపీగా పట్టాలపై నుంచి లేచి ఫోన్ మాట్లాడుతూ వెళ్లడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.

ఈ వీడియోను ఓ ఐపీఎస్ అధికారి తన ట్విట్టర్లో షేర్ చేశారు. 'ప్రాణాల కన్నా.. ఫోన్లో గాసిప్స్ మాట్లాడటమే అంత ముఖ్యమై పోయిందా? ' అంటూ పోస్ట్ చేయగా నెటిజన్లు సైతం ఆ యువతిని ఏకీపారిరేస్తున్నారు. ఆ యువతికి గాలంట్రీ అవార్డు కింద ఒక్కటి లాగిపెట్టి కొట్టండి అంటూ ఓ నెటిజన్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.

ఇక ఇదే వీడియోను రైల్వే అధికారులు సైతం పోస్టు చేసి రైలు దాటే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ ఘటన ఈ ఏడాది ఏప్రిల్ నెలలో చోటు చేసుకొగా నేటికీ తెగ వైరల్ అవుతూనే ఉంది. దీనిపై మీ రియాక్షన్ ఏంటో కింద తెలియజేయండి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.