Begin typing your search above and press return to search.

పింఛన్ రాలేదో పెట్రోల్ పోసి చంపేస్తా కొడవలి తో కార్యదర్శిని బెదిరించిన మహిళ

By:  Tupaki Desk   |   12 Nov 2019 8:30 AM GMT
పింఛన్ రాలేదో పెట్రోల్ పోసి చంపేస్తా కొడవలి తో కార్యదర్శిని బెదిరించిన మహిళ
X
తెలంగాణ లోని అబ్దుల్లాపూర్‌మెట్ లో తహసీల్దార్ పై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన ఘటన అందరికి తెలిసిందే. ఈ ఘటన ఏ ముహూర్తంలో జరిగిందో కానీ, ఇక అప్పటినుండి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రభుత్వ అధికారులకి చుక్కలు చూపిస్తున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ప్రభుత్వ ఆఫీసు రూమ్ లోకి వెళ్లి తమ పని కాకపోతే ..పెట్రోల్ పోసి చంపుతాం, కత్తితో చంపుతాం అని ..రెవెన్యూ సిబ్బందిని బెదిరిస్తున్నారు. తెలంగాణలో బాటిల్స్ లో పెట్రోల్ పట్టవద్దు అని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది అంటేనే అర్థం చేసుకోవచ్చు ..ఈ బెదిరింపులు ఏ రేంజ్ లో సాగుతున్నాయో..

తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి అనంతపురంలో జరిగింది. ఓ మహిళ తన పింఛన్ డబ్బు కోసం ఎంపీడీవో కార్యాలయంలో హల్చల్ చేసింది. తన పింఛన్ డబ్బు ఇవ్వకపోతే చంపేస్తానంటూ పంచాయతీ కార్యదర్శిని బెదిరిచింది. ప్పేరుకు చెందిన శివమ్మ మరికొందరు స్థానికులు ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లారు. తమకు నవంబరు నెలకు సంబంధించిన పింఛను ఇవ్వాలని, తమకు ఈ నెల పింఛన్ ఎందుకు ఇవ్వలేదని పంచాయతీ కార్యదర్శి మురళీకృష్ణను నిలదీశారు. ఈ నెల ఇవ్వడానికి లేదని, వచ్చే నెల నుంచి ఇస్తామని ఆయన సమాధానం ఇచ్చారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన వారు వచ్చే నెల కనుక పింఛన్ రాకపోతే పెట్రోలు పోసి తగలబెట్టేస్తామని బెదిరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని పెన్నోబులేశు, శివమ్మతోపాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. శివమ్మ కార్యాలయంలోకి వెళ్లిన సమయంలో ఆమె చేతిలో కొడవలి ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శివమ్మ కొడవలితో అక్కడికి ఎందుకు వెళ్లిందన్న విషయంపై ఆరా తీస్తున్నట్టు పోలీసులు తెలిపారు.