Begin typing your search above and press return to search.

బిర్యానీ కోసం సూసైడ్ చేసుకున్న మహిళ

By:  Tupaki Desk   |   28 Jun 2020 6:00 AM IST
బిర్యానీ కోసం సూసైడ్ చేసుకున్న మహిళ
X
సిల్లీగా అనిపించే అంశాలు కొన్ని సీరియస్ గా మారుతుంటాయి. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవకు చెందిందే. భార్యభర్తల మధ్య చోటు చేసుకున్న ఒక వాదన.. ప్రాణాలు తీసుకోవటం వరకూ వెళ్లటం ఒక సిత్రమైతే.. ఆ వాదన బిర్యానీ కోసం కావటం గమనార్హం. తాను బిర్యానీ తెమ్మంటే.. తర్వాత తెస్తానన్న భర్త మాటలతో ఆగ్రహానికి గురైన ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్న వైనం తమిళనాడులో చోటు చేసుకుంది.

మహాబలిపురం సమీపంలోని నివసించే మనోహరన్.. శరణ్య దంపతులు ఉంటారు. వారికి ఒక కుమార్తె.. కుమారుడు ఉన్నారు. శిల్పాల తయారీ సంస్థలో పని చేసే మనోహరన్ కు సైతం మహమ్మారి పోటు తప్పలేదు. లాక్ డౌన్ తదితర పరిణామాల నేపథ్యంలో అతడి సంపాదన మీద ప్రభావం పడింది. దీంతో.. ఆచితూచి అన్నట్లు ఖర్చు చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే.. భర్త మనోహర్ ను బిర్యానీ తీసుకురావాలని శరణ్య కోరింది. జేబులో డబ్బులు కొద్దిగానే ఉన్నాయని.. తర్వాత తెచ్చుకుందామని చెప్పాడు. భర్త మాటలు శరణ్యకు బాధను కలిగించాయి. భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన కాసేపటికే.. వేదనకు లోనైన శరణ్య ఆత్మహత్యకు పాల్పడింది. భర్త బైకులోని పెట్రోల్ తీసి ఒంటి మీద పోసుకొని.. నిప్పు అంటించుకుంది. దీన్ని గుర్తించిన స్థానికులు మంటల్ని ఆపే ప్రయత్నం చేశారు. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. భర్త బిర్యానీ తీసుకురానంటే మాత్రం.. ఆ మాత్రానికే ఆత్మహత్య చేసుకోవాలా? అని విస్తుపోతున్నారు స్థానికులు.