Begin typing your search above and press return to search.
మహిళా ఎస్సై పై కాల్పులు.. మృతి
By: Tupaki Desk | 8 Feb 2020 12:34 PM ISTఅసెంబ్లీ ఎన్నికల సమయం.. దేశ రాజధాని ఢిల్లీ అంతటా ఉత్కంఠ.. ఎన్నికల బందోబస్తు లో పోలీసులు.. ఈ క్రమంలోనే ఢిల్లీలో ఓ మహిళా పోలీస్ అధికారి దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది. వాయువ్య ఢిల్లీలోని మెట్రో స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
హర్యానా రాష్ట్రంలోని సోనిపట్ కు చెందిన ప్రీతి అహ్లావత్(26) 2018లో పోలీస్ ఉద్యోగానికి ఎంపికైంది. ప్రస్తుతం ఆమె తూర్పు ఢిల్లీలోని పబ్పార్గంజ్ ఎస్సైగా పనిచేస్తోంది. రోహిణి అనే ప్రాంతంలో నివాసముంటోంది.
శుక్రవారం విధులు ముగించుకొని 9.30 గంటలకు మెట్రో స్టేషన్ నుంచి నడుచుకుంటూ ఎస్సై ప్రీతి వెళ్తుండగా.. గుర్తు తెలియని దుండగుడు ఆమెపై కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందగానే పోలీసులు గాలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించామని.. పట్టుకుంటామని తెలిపారు.
కాగా ఎస్సై ప్రీతి హత్యకు వ్యక్తిగత కక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెకు పరిచయం ఉన్న దీపాంశు అనే వ్యక్తియే ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. హర్యానాలోని సొంతింటికి వెళ్లి నిందితుడు దీపాంశు కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. దీపాంశు కూడా ఢిల్లీలో పోలీస్ అధికారి కావడం గమనార్హం. ప్రేమ వ్యవహారమే ప్రీతి హత్యకు దారితీసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.