Begin typing your search above and press return to search.
బాబర్ ఆజమ్ నన్ను గర్భిణిని చేశాడు.. మహిళ సంచలన ఆరోపణలు
By: Tupaki Desk | 30 Nov 2020 9:00 AM ISTక్రీడాకారులపై లైంగిక ఆరోపణలు కొత్తకాదు. వారి వ్యక్తిగత జీవితాలపై అనేక పుకార్లు వస్తుంటాయి. అవి నిజమైన సందర్భాలు ఉన్నాయి. క్రీడల్లో సక్సెస్ అయిన చాలామంది వ్యక్తిగత జీవితాల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న వారు ఉన్నారు. తాజాగా పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబార్ ఆజమ్ పై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. బాబార్ తనను శారీరకంగా వాడుకొని వదిలేశాడని.. తనను గర్భవతిని చేశాడని సదరు మహిళ ఆరోపించింది. ఓ జర్నలిస్ట్ ఇందుకు సంబంధించిన వీడియోను విడుదల చేయగా ఇప్పుడది వైరల్‌గా మారింది. 2010లో బాబర్ తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని సదరు మహిళ ఆరోపించింది. బాబర్ ఆజమ్ క్రికెటర్ గా ఎదిగేందుకు తాను ఎంతో సహకరించానని.. ఆర్థికసాయం చేశానని కూడా ఆమె చెప్పింది.
బాబర్ స్టార్ క్రికెటర్‌గా ఎదిగాక తనను వదిలేశాడని.. శారీరకంగా వేధించాడని ఆమె పేర్కొన్నారు. ఆమె ఇంకా ఏమందంటే.. ‘నేను బాబర్ స్కూల్ డేస్ నుంచి ఫ్రెండ్స్. బాబర్‌కు చిన్నప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. అతడికి నేను ఎన్నోసార్లు డబ్బు సాయం చేశాను. నేను బాబర్ ప్రేమించుకున్నాం. 2010లో అతడు నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాడు. ఆ తర్వాత ఏడాది పాటు శారీరకంగా దగ్గరయ్యాం. ఇద్దరం కలిసి చాలా చోట్లకు వెళ్లాం. 2012లో అండర్-19 ప్రపంచకప్‌లో బాబర్ పాక్జట్టుకు కెప్టెన్ అయ్యాడు. అతర్వాత అతడు జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. జాతీయజట్టుకు ఎంపికయ్యాక బాబర్ నన్ను వదిలించుకోవాలని చూశాడు. నేను పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా కొట్టేవాడు. ఈ విషయంపై పోలీసులకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. నేను పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు కూడా ఫిర్యాదు చేశాను. వాళ్లు పట్టించుకోలేదు. దయచేసి నాకు న్యాయం చేయండి’ అంటూ సదరు మహిళ తీవ్ర ఆరోపణలు చేశారు.
అయితే ప్రస్తుతం ఐసీసీ ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో అన్ని ఫార్మాట్లలోనూ బాబర్ ఆజమ్ టాప్-5లో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నాడు. ఈ ఏడాది మొదట్లో పాక్ క్రికెట్ బోర్డు అతడిని మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా నియమించింది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 18న మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. పాకిస్థాన్ క్రికెట్ జట్టులో ఏడుగురికి కరోనా పాజిటివ్ అని తేలిన సంగతి తెలిసిందే. దీంతో పాక్ క్రికెట్ జట్టులోని మిగతా ఆటగాళ్లు క్రైస్ట్‌చర్చిలోని హోటల్‌లో క్వారంటైన్లో ఉన్నారు. అయితే ఈ విషయంపై ఇంతవరకు బాబర్ స్పందించలేదు. బాబర్ అభిమానులు మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు.