Begin typing your search above and press return to search.

తమిళనాడులో దారుణం: అప్పు తీర్చలేదని మహిళపై అత్యాచారం !

By:  Tupaki Desk   |   24 July 2020 2:20 PM IST
తమిళనాడులో దారుణం: అప్పు తీర్చలేదని మహిళపై అత్యాచారం !
X
యుగాలు మారినా, కాలాలు మారినా ఆడవాళ్ల పై జరిగే అఘాయిత్యాలని ఎవరు అడ్డుకోలేకపోయారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకువస్తున్న కూడా అవి కేవలం చట్టాలుగానే మిగులుతున్నాయి కానీ, మహిళల రక్షణ కోసం ఆ చట్టాలు ఏ మాత్రం ఉపయోగపడటం లేదు. ప్రతి రోజు ఎక్కడో ఒక చోట మహిళపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తమిళనాడులో వెయ్యి రూపాయలు అప్పు ఇచ్చి , ఆ అప్పును తీర్చలేదని ఆ మహిళ పై అత్యాచారం చేసాడు ఓ ప్రబుద్దుడు. ఆ వ్యక్తికి తమిళనాడులోని న్యాయస్థానం 34ఏళ్ల జైలుశిక్ష విధించింది.

ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే .. నామక్కల్‌ జిల్లాకు చెందిన ఓ మహిళ 2010 ఏప్రిల్‌ 4న శివకుమార్‌ అనే వ్యక్తి వద్ద రూ.1000 అప్పు తీసుకుంది. చెప్పిన సమయానికి ఆమె అప్పు తీర్చకపోవడంతో శివకుమార్ ఆమెను వేధించేవాడు. ఆమె పరిస్థితిని ఆసరాగా తీసుకుని సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని, నిర్మాత రమ్మంటున్నాడని నమ్మించి ఆమెను తన దుకాణానికి రమ్మని చెప్పి పిలిచాడు. అక్కడ శివకుమార్ ఆమెను బెదిరించి అత్యాచారం చేసాడు. రవి ఆ దారుణాన్నిసెల్‌ఫోన్లో వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. దీనితో బాధితురాలు నిందితులు పై జరిగిందంతా చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. విచారణ సమయంలో రవి చనిపోయాడు.ఆ కేసుకు సంబంధించి గురువారం తుది విచారణ చేపట్టిన న్యాయస్థానం శివకుమార్‌కు రూ.34ఏళ్ల జైలుశిక్ష, 13వేల జరిమానా విధించింది. అలాగే ఆ బాధితురాలికి రూ.5లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.