Begin typing your search above and press return to search.

ఆమెపై 43200 సార్లు అత్యాచారం

By:  Tupaki Desk   |   12 Nov 2015 2:13 PM IST
ఆమెపై 43200 సార్లు అత్యాచారం
X
ఇది స్వయంగా బాధితురాలు చెబుతున్న సంగతే. తనపై నాలుగేళ్ల వ్యవధిలో రోజుకు 30 మంది చొప్పున మొత్తం 43 వేల 200 సార్లు అత్యాచారం చేశారని అంటోంది ఆ అభాగ్యురాలు. హ్యూమన్ ట్రాఫికింగ్ - అమ్మాయిల్ని సెక్స్ బానిసలుగా అమ్మేయడం లాంటివి సర్వసాధారణమైన మెక్సికోలో చోటు చేసుకున్న దారుణమిది.

నాలుగేళ్ల పాటు ఓ డెన్‌ లో సెక్స్ బానిసగా మగ్గి.. అక్కడి నుంచి అనుకోకుండా బయటపడిన ఓ యువతి.. తాను నాలుగేళ్ల పాటు అనుభవించిన చిత్రవధ గురించి బయటి ప్రపంచానికి వెల్లడించింది. నాలుగేళ్ల పాటు తాను ప్రతి రోజూ అత్యాచారానికి గురయ్యానని.. రోజుకు 30 మంది చొప్పున తనను రేప్ చేశారని.. ఇలా నాలుగేళ్లలో మొత్తం 43,200 సార్లు తాను అత్యాచారానికి గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

తనకు 12 ఏళ్ల వయసుండగా.. కొందరు దుర్మార్గులు ఖరీదైన బహుమతులు - బోలెడంత డబ్బు - విలాసవంతమైన కార్లు ఇస్తానంటూ మభ్యపెట్టి వ్యభిచారంలోకి దింపారని.. మెక్సికోలోని ఓ నగరానికి తరలించి.. సెక్స్ బానిసగా మార్చారని... ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు తనపై అత్యాచారాలు జరిగేవని చెప్పింది. తాను ఏడుస్తుంటే నవ్వేవాళ్లని.. తనను శారీరకంగానూ చిత్రహింసలకు గురి చేసేవారని చెప్పింది.