Begin typing your search above and press return to search.

బర్త్ డే కోసం మెక్సికో వెళ్లి .. శవంగా మారిన భారతీయ సంతతి మహిళ !

By:  Tupaki Desk   |   23 Oct 2021 9:00 PM IST
బర్త్ డే కోసం మెక్సికో వెళ్లి .. శవంగా మారిన భారతీయ సంతతి మహిళ !
X
తాజాగా మెక్సికోలో జరిగిన కాల్పుల్లో భారతీయ సంతతికి చెందిన మహిళ మరణించింది. కాలిఫోర్నియా కు చెందిన 25 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన మహిళా టెక్కీ తన పుట్టినరోజును జరుపుకోవడానికి మెక్సికోకు వెళ్లింది. అక్కడ కరేబియన్ తీరప్రాంత రిసార్ట్ తులమ్‎కు వెళ్లారు. అక్కడ రెండు డ్రగ్స్ ముఠాల మధ్య జరిగిన కాల్పుల్లో ఆమె తో పాటు మరొక పర్యాటకురాలు బుల్లెట్ తగిలి మరణించారని స్థానిక మీడియా తెలిపింది. ఈ ఘటన గత బుధవారం జరిగింది. కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌ లో నివసిస్తున్న హిమాచల్ ప్రదేశ్‌ కు చెందిన అంజలి రియోట్ తను ట్రావెల్ బ్లాగర్‌ గా ఇన్‌ స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొన్నారు.


ఆమె లింక్డ్‌ ఇన్‌ లో సీనియర్ సైట్ రిలయబిలిటీ ఇంజనీర్‌ గా పనిచేస్తున్నారు. రియోట్ ఇంతకుముందు యాహూలో ఉద్యోగం చేసినట్లు తెలిసింది. అక్టోబర్ 22న ఆమె జన్మదినానికి ముందు సోమవారం ర్యోత్ తులం చేరుకున్నారు. గత బుధవారం రాత్రి రియోట్, మరో నలుగురు విదేశీ పర్యాటకులు లా మల్క్వెరిడా రెస్టారెంట్ టెర్రస్‌లో భోజనం చేస్తున్నారు. రాత్రి 10:30 గంటల ప్రాంతంలో నలుగురు వ్యక్తులు పక్కనే ఉన్న టేబుల్‌పై కాల్పులు జరిపినట్లు స్పానిష్ వార్తాపత్రిక ఎల్ పైస్ నివేదించింది. వారికి బుల్లెట్లు తాగిలాయి. కాల్పుల్లో అంజలి రియోట్‎తోపాటు జర్మన్ టూరిస్ట్‌ మరణించారు. నెదర్లాండ్స్‌ కు చెందిన మరో ముగ్గురు గాయపడ్డారు.

ఈ ప్రాంతంలో డ్రగ్స్ విక్రయాలు నిర్వహిస్తున్న రెండు ప్రత్యర్థి గ్రూపుల మధ్య ఈ పోరాటం జరిగిందని క్వింటానా రూ స్టేట్ ప్రాసిక్యూటర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మెక్సికన్ రాష్ట్రంలో అనేక డ్రగ్ కార్టెల్‌లు పనిచేస్తున్నాయి, ఇది లాభదాయకమైన రిటైల్ డ్రగ్ మార్కెట్‌గా డ్రగ్ షిప్‌మెంట్‌లకు ల్యాండింగ్ స్పాట్‌గా పేరుగాంచిందని మెక్సికో సిటీ నుండి అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది. ఇంతలో, రియోట్ సోదరుడు ఆశిష్ రియోట్ సోదరి మృతదేహాన్ని స్వదేశానికి రప్పించడానికి ప్రక్రియను వేగవంతం చేయాలని తులుం మేయర్‌ను కోరినట్లు ఎల్ పైస్ నివేదిక తెలిపింది.