Begin typing your search above and press return to search.
సెనెటర్ అభ్యర్థిగా భారత సంతతి మహిళ .. ఒబామా ఆమోదం !
By: Tupaki Desk | 7 Aug 2020 3:00 PM ISTభారత సంతతికి చెందిన మహిళ అయిన సారా గిడియాన్ ను మైనే రాష్ట్రం డెమొక్రటిక్ పార్టీ సెనెటర్ అభ్యర్థిగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆమోదం తెలిపారు. ఈ ఏడాది అమెరికాలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు చెందిన అభ్యర్థుల పేర్లను ఒబామా ప్రకటించారు. ఆ పేర్లలో భారత సంతతికి చెందిన సారా గిడియాన్ పేరు కూడా ఉండటం విశేషం. ఆలోచనాత్మక, అధిక అర్హత కలిగిన వారిని సెనెటర్ అభ్యర్థులుగా ఆమోదించడం గర్వంగా ఉందంటూ ఒబామా ఓ ప్రకటన విడుదల చేశారు. తాను ఆమోదించిన అభ్యర్థులందరూ ప్రజల కోసం పాటుపడతారని, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్క అమెరికన్ కోసం పోరాటం చేస్తారని ఒబామా తెలిపారు.
48 ఏళ్ల ఎంఎస్ గిడియాన్ ఇప్పుడు మైనే స్టేట్ అసెంబ్లీ స్పీకర్ గా భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. రిపబ్లికన్ సెనేటర్ సుసాన్ కాలిన్స్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. దీనితో ఆమెని అభ్యర్థిగా పెడితే ఆ సెనెటర్ స్థానం డెమొక్రటిక్ పార్టీ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ నేతలు విశ్వసించి ఆమె పేరుని ఖరారు చేసారు. ఇటీవల వచ్చిన పోల్స్ ఫలితాల్లో కూడా సారా గిడియాన్‌కు ఎక్కువ శాతం మంది మద్దతు తెలిపినట్టు తేలింది. ఇక రిపబ్లికన్ పార్టీ నుంచి ప్రస్తుతం సెనెటర్ గా వ్యవహరిస్తున్న సూసన్ కొల్లిన్స్ మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరోపక్క అధ్యక్ష అభ్యర్థి రేస్‌లో ఉన్న జో బైడెన్ సైతం సారా గిడియాన్ ను సెనెటర్ అభ్యర్థిగా ఆమోదించారు.
కాగా.. సారా గిడియాన్ తండ్రి భారతీయుడు కాగా, ఆమె తల్లి అమెరికన్ దేశస్థురాలు. సారా ఒకవేళ నవంబర్ లో ఎన్నికైతే అమెరికా సెనెట్ కు ఎన్నికైన రెండో ఇండియన్ అమెరికన్ గా రికార్డు సాధిస్తారు. అయితే సారా గిడియాన్ తో పాటు రిపబ్లికన్ పార్టీ నుంచి మరో ఇద్దరు ఇండియన్ అమెరికన్స్ సెనెట్ కు పోటీ చేస్తున్నారు. కాలిఫోర్నియా నుంచి మొట్టమొదటి సారి భారత సంతతి మహిళ అయిన కమలా హ్యారిస్ అమెరికా సెనేట్ కు ఎన్నికైయ్యారు.