Begin typing your search above and press return to search.
మోడీజీ.. ఇదెక్కడి అన్యాయం? అమ్మాయిల వివాహ బిల్లులో అలా చేయటమా?
By: Tupaki Desk | 3 Jan 2022 11:17 AM ISTమోడీ సర్కారు గురించి గొప్పలు చెప్పుకునే వారంతా తమ చెవుల్ని కాస్తంత పెద్దవి చేసుకొని వినాల్సిన అంశంగా దీన్ని చెప్పాలి. నిత్యం నీతులు బోధిస్తూ.. పెద్ద మనిషిలా వ్యవహరించే ప్రధాని మోడీ.. తమ ప్రభుత్వంలోనూ ఇలాంటి తప్పులు దొర్లుతాయా? అన్నట్లుగా ఉండే వాటి గురించి బయటకు వచ్చిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా అమ్మాయిల వివాహ వయసును 21 ఏళ్లకు పెంచుతూ కేంద్రం బిల్లును తీసుకురావటం తెలిసిందే.
అయితే.. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావటంతో సెలక్టు కమిటీకి ఈ బిల్లును పంపటం తెలిసిందే. అయితే.. ఈ పార్లమెంటరీ కమిటీలో ఒకే ఒక్క మహిళకు చోటు లభించటం వేలెత్తి చూపించేలా మారింది. 31 మంది సభ్యులతో పార్లమెంటరీ ప్యానెల్ ఏర్పాటు అయితే.. అందులో టీఎంసీ (త్రణమూల్ కాంగ్రెస్) కు చెందిన ఎంపీ సుస్మితా దేవ్ కు మాత్రమే చోటు లభించింది.
రాజ్కయసభ వెబ్ సైట్ వెల్లడిస్తున్న సమాచారం ప్రకారం బీజేపీ సీనియర్ నేత వినయ్ సహస్రబుద్ధ ఆధ్వర్యంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ బిల్లును పరిశీలిస్తుంది. ఇందులో మొత్తం 31 మందితో కూడిన కమిటీలో ఒకే ఒక్క మహిళా ఎంపీకి చోటు లభించటాన్ని పలువురు మహిళా ఎంపీలు తప్పు పడుతున్నారు. ప్యానెల్ లో మహిళల ఎంపీల సంఖ్య పెరిగితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇప్పటివరకు యువతుల వయసు 18ఏళ్లుగా ఉంటే.. ఇప్పుడు దాన్ని 21 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఇది చట్టంగా మారటానికి ముందు.. ఇందులో పేర్కొన్న అంశాల్ని పార్లమెంటరీ కమిటీ చర్చలు జరిపి.. బిల్లులో మార్పులు చేర్పులు చేయాలంటే వాటిని ప్రభుత్వానికి సూచిస్తుంది. మహిళలకు సంబంధించిన బిల్లుపై చర్చించే కమిటీలో మహిళలకు చోటు లేకపోవటం ఏమిటి మోడీజీ? ఇందులో మోడీ పాత్ర నేరుగా లేకున్నా.. ఇలాంటి సున్నితమైన అంశాలపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా?