Begin typing your search above and press return to search.

ముఖ్యమంత్రికే ముద్దు పెట్టేసింది

By:  Tupaki Desk   |   26 Jun 2016 10:57 PM IST
ముఖ్యమంత్రికే ముద్దు పెట్టేసింది
X
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఊహించిన ఘటన ఎదురైంది. ఈ మధ్య కాలంలో తరచూ వివాదాల్లో కూరుకుపోతున్న ఆయన.. తాజాగా తన ప్రమేయంలో లేకుండా టాప్ హెడ్ లైన్స్ లో దర్శనం ఇవ్వాల్సిన పరిస్థితి. ప్రజలంతా చూస్తున్న వేళ.. ఒక బహిరంగ సభలో ఒక మహిళ నేత ముఖ్యమంత్రి బుగ్గ మీద ముద్దు పెట్టటం ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.ఈ ఆసక్తికర సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటు చేసుకుంది.

అనుకోని విధంగా జరిగిన ఈ పరిణామం మీద ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించనట్లుగా కనిపించిందనే చెప్పాలి. ఇంతకీ అసలేం జరిగిందంటే.. కురుబ వర్గం వారు ఒక సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఇదే వర్గానికి చెందిన వారు. ఈ సందర్భంగా ఒక బహిరంగ సభను ఏర్పాటు చేశారు. వేదిక మీదకు వచ్చిన చిక్ మగ్ ళూరు జిల్లా తరికేరి ప్రాంతానికి చెందిన పంచాయితీ సభ్యురాలు గిరిజా శ్రీనివాసన్ ముఖ్యమంత్రిని సన్మానించారు. అనంతరం సభా వేదిక మీద అందరూ చూస్తుండగా.. సీఎం కుడి చెంప మీద ముద్దు పెట్టుకున్నారు. తన ఒక చేతిని సీఎం బుగ్గ మీద పెట్టి.. మరో బుగ్డ మీద ఆమె మద్దు పెట్టేశారు.

ఈ ఉదంతంతో ఒక్కసారి కలకలం రేగింది. సభా వేదిక మీద ఉన్న వారు.. సభికులు అంతా షాక్ తిన్నట్లుగా ఉండిపోయారు. ముఖ్యమంత్రి మాత్రం ఇదేమీ పట్టనట్లుగా హుందాగా వ్యవహరించే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రిని ముద్దు పెట్టుకున్న పంచాయితీ సభ్యురాలు గిరిజా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి తనకు తండ్రి లాంటి వారని.. ఆయన్ను మొదటిసారి కలుసుకున్నానన్న సంతోషంతో తాను అలా ముద్దు పెట్టుకున్నట్లుగా చెప్పుకున్నారు. ఒక మహిళా నేత బహిరంగంగా ముఖ్యమంత్రిని ముద్దు పెట్టుకున్న ఘటన సంచలనంగా మారి.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.