Begin typing your search above and press return to search.

ప్రియుడి కళ్లముందే ప్రియురాలిపై అత్యాచారం..

By:  Tupaki Desk   |   26 May 2018 11:08 AM GMT
ప్రియుడి కళ్లముందే ప్రియురాలిపై అత్యాచారం..
X

గోవాలో దారుణం జరిగింది. ఒక మహిళపై ఆమె ప్రియుడి ముందే ముగ్గురు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. గోవా రాజధాని పనాజికి 50కి.మీ దూరంలో ఉన్న సెన్నాభతిమ్ బీచ్ లో గురువారం రాత్రి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

బీచ్ లో ఉన్న జంట వద్దకు ముగ్గురు వ్యక్తులు వచ్చి బెదిరించారు. బలవంతంగా వారి బట్టలు విప్పించి ఫొటోలు తీశారు. ఆ పై డబ్బులు డిమాండ్ చేశారని పోలీసులు వెల్లడించారు. అనంతరం బాయ్ ఫ్రెండ్ ముందే ఆమెపై గ్యాంగ్ రేప్ కు పాల్పడినట్టు తెలిపారు..

ఆ బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు గోవా ఎస్పీ అరవింద్ గవాస్ తెలిపారు. ఇప్పటికీ చాలామంది అనుమానులను విచారించిన పోలీసులు.. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెబుతున్నారు