Begin typing your search above and press return to search.
భర్తను భుజాన ఎత్తుకున్న ఆమెను.. గ్రామస్తులు ఎందుకు కొట్టారంటే?
By: Tupaki Desk | 31 July 2020 11:30 AM ISTఅనాగరిక ఘటన ఒకటి చోటు చేసుకుంది. భార్య తప్పు చేసిందని.. ఆమెకు వివాహేతర సంబంధం ఉందన్న ఆరోపణలు చేసిన భర్తకు అనుకూలంగా అక్కడి గ్రామస్థులు తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారటమే కాదు.. తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
మధ్యప్రదేశ్లోని జాభువా జిల్లాలోని ఛప్రీ రన్వాస్ అనే గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన కూలీలైన భార్యభర్తలు జీవిస్తుంటారు. గుజరాత్ లో పనులు చేసే వారు ఇటీవల గ్రామానికి తిరిగి వచ్చారు. తన భర్తకు అక్రమ సంబంధం ఉందంటూ భర్త ఆరోపించాడు. అతడి మాటలకు విలువనిస్తూ గ్రామస్థులు.. భార్యకు దారుణమైన శిక్షను విధించారు.
భర్తను భుజాన మోస్తూ రోడ్ల మీద తిరగాలన్న తీర్పుతో పాటు.. అలా నడుస్తున్న ఆమెను భర్త బంధువులు.. గ్రామస్థులు కర్రలతో కొట్టే దారుణమైన శిక్షను అమలు చేశారు.దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భర్త ఆరోపించిన వెంటనే భార్యకు దారుణమైన శిక్ష విధించటంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదేమాత్రం సరికాదంటూ పలువురు మండిపడుతున్నారు. ఈ ఉదంతంపై స్పందించిన పోలీసులు రంగంలోకి దిగారు. ఈ దారుణానికి కారణమైన భర్తతో పాటు మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదంతంపై విచారణ జరుపుతున్నాయి. అయితే.. మధ్యప్రదేశ్ లో గిరిజన తెగలు ఎక్కువగా ఉండే కొన్ని జిల్లాల్లో ఇలాంటి దారుణాలు తరచూ చోటు చేసుకుంటాయని చెబుతున్నారు.
గ్రామస్థులు ఇష్టారాజ్యంగా తీసుకునే చర్యల విషయంలో స్థానిక నేతలు సైతం పట్టనట్లుగా వ్యవహరిస్తారని చెబుతున్నారు. దీనికి కారణం ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా ప్రజలుభావిస్తారని.. ఎన్నికల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న ఉద్దేశంతో తమకేమాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తారన్న వాదన వినిపిస్తోంది. ఇదంతా చూస్తున్నప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు ఫర్లేదన్న భావన కలుగక మానదు.