Begin typing your search above and press return to search.

మత్తు మందిచ్చి రెబల్ ఎంపీ రేప్ చేశాడని ఫిర్యాదు

By:  Tupaki Desk   |   18 Jun 2021 9:00 AM IST
మత్తు మందిచ్చి రెబల్ ఎంపీ రేప్ చేశాడని ఫిర్యాదు
X
లోక్ జనశక్తి పార్టీలో తిరుగుబాటు సెగలు చల్లారడం లేదు. తాజాగా ఆ పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వన్ ను ఆ పార్టీనుంచి మిగతా ఎంపీలు తొలగించేశారు. పశుపతి పరాస్ ను కొత్త అధ్యక్షుడిని చేశారు. ఈయన చిరాగ్ కు సొంత బాబాయియే.. వీరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

అబ్బాయి వ్యవహారశైలి బాగా లేదని.. అందుకే పార్టీని రక్షించేందుకే తానే మిగతా ఎంపీలతో బయటకు వచ్చానని బాబాయి పరాస్ చెప్పారు.

ఇక తనను వెన్నుపోటు పొడిచారని చిరాగ్ పాశ్వాన్ ఆరోపిస్తున్నారు. ఇందులో జేడీయూ హస్తం ఉందని.. తమ పార్టీలో సంక్షోభానికి నితీష్ కుమార్ వర్గం కారణమని ఆరోపించారు. ఇక చిరాగ్ వెంట అతడి కజిన్ సోదరుడు ఎంపీ ప్రిన్స్ రాజ్ పాశ్వాన్ కూడా లేడు. ప్రిన్స్ రాజు సైతం బాబాయ్ పశుపతితో కలిసి చిరాగ్ ను మోసం చేశాడని చిరాగ్ ఆవేదన చెందాడట.

ఈ రాజకీయవేడిలోనే లోక్ జనశక్తి పార్టీ ఎంపీ అయిన ప్రిన్స్ రాజ్ పాశ్వాన్ తనపై లైంగిక దాడి చేశాడంటూ ఓ మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం సంచలనమైంది. ‘నా డ్రింక్ లో మత్తుమందు కలిపి ప్రిన్స్ రాజ్ .. ఢిల్లీలోని ఓ హోటల్ లో నాపై అత్యాచారం చేశాడు’ అని ఆమె ఆరోపించారు. దీనిపై విచారించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.