Begin typing your search above and press return to search.

రేప్ చేశారని చెప్పి తప్పించుకోవాలనుకుంది!

By:  Tupaki Desk   |   1 Aug 2015 6:51 AM GMT
రేప్ చేశారని చెప్పి తప్పించుకోవాలనుకుంది!
X
ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటానంటే... తల్లి తండ్రులు అడ్డుచెప్పారు! 22 ఏళ్ల అమ్మాయి తీసుకునే నిర్ణయం, దాంపత్య జీవితం, వివాహ జీవితం గురించి ఆ వయసులో తీసుకునే నిర్ణయాల్లో ఆలోచన కంటే... వయసు తాలూకు ఆవేశం ఎక్కువగా ఉంటుందని గ్రహించిన తళ్లితండ్రులు వద్దని అడ్డుచెప్పారు! ఇదే సమయంలో వేరే సంబందాలు చూడటం మొదలు పెట్టారు! ఆ పనిని ఎలా నిరోదించాలో తెలియని ఆ అమ్మాయి... తన తెలివికి, తన ఆలోచనా స్థాయికీ తగ్గ పనికి పూనుకుంది. ఫలితంగా పోలీసుల ఆగ్రహానికి లోనయ్యింది!

విషయానికి వస్తే... 22 ఏళ్ల ఒక అమ్మాయి ఒక యువకుడిని ప్రేమించింది. దీనికి తల్లితండ్రులు వద్దని చెప్పి, వేరే సంబందం చూడటం మొదలుపెట్టారు! ఈ క్రమంలో తన పెళ్లిని తప్పించుకోవడానికి తనపై నిందవేసుకుంది! ఈమె తమిళనాడులో హాస్టల్ లో ఉంటూ ఒక సంస్థలో ఉద్యోగం చేస్తోంది. అయితే ఒక రోజు హాస్టల్ రూం లో కాళ్లకు చేతులకు కట్లతో బందింపబడి ఉంది! ఆ పరిస్థితిలో ఆమెను చూసిన హాస్టల్ సిబ్బంది ఆరా తీయగా... తనపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారని చెప్పడoతో... విషయం పోలీసుల చెంతకు చేరింది!

అక్కడితో ఆమె తల్లితండ్రులు కూడా పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు! అయితే పోలీసు విచారణలో దాని తాలూకు గుర్తులు ఏమీ కనిపించక పోవడంతో... కాస్త సీరియస్ గా తమదైన స్టైల్లో అడిగిన పోలీసులకు అసలు విషయం చెప్పింది ఆ యువతి! తనపై ఎవరూ అత్యాచారం చేయలేదని, అలా అని చెబితే ఇక తనను ఎవరూ పెళ్లి చేసుకోరని. దాంతో ప్రేమించిన వాడినే పెళ్లిచేసుకోవచ్చని తెలిపింది! ఈ విషయం విన్న పోలీసులకు పిచ్చి కోపం వచ్చింది. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పోలీస్ కేసు పెడతామని హెచ్చరించారు! దీంతో విషయం సద్దుమణిగింది!