Begin typing your search above and press return to search.

సింహల మధ్య ప్రసవించిన మహిళ ..ఆ తరువాత ఏమైంది

By:  Tupaki Desk   |   22 May 2020 3:30 AM GMT
సింహల మధ్య ప్రసవించిన మహిళ ..ఆ తరువాత ఏమైంది
X
గుజరాత్‌ లో ఓ నిండు గర్భిణీ భయంకరమైన పరిస్థితి ఎదుర్కుంది. అడవి మధ్యలో ప్రసవించాల్సిన పరిస్థితి ఎదురైంది. గిర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన అందరినీ కలిచివేస్తోంది. అసలు అడవి మధ్యలో ఆమె ప్రసవం ఎందుకు జరిగింది ..ఆ తర్వాత ఏమైంది అనే విషయాల గురించి ఇప్పుడు పూర్తిగా చూద్దాం...

గిర్ అటవీ ప్రాంతం సింహాలకు చాలా ప్రసిద్ధి చెందింది. అక్కడ ఉండే వారికి తరచుగా వాటితో సహవాసం తప్పదు. కానీ ఓ నిండు గర్భిణీ మాత్రం భయంకరమైన పరిస్థితి ఎదుర్కుంది. గిర్ సోమ్‌నాథ్ ‌లో ఉంటున్న ఆమెకు అర్ధరాత్రి సమయంలో ప్రసవ నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆంబులెన్స్‌ కు ఫోన్ చేశారు. వెంటనే ఆంబులెన్స్ ఆమె ఇంటికి చేరుకుంది. ఆస్పత్రికి ప్రయాణం ప్రారంభమైంది. మధ్యలో గిర్ అటవీ ప్రాంతం గుండా వెళ్లాలి. సరిగ్గా నట్టడవిలోకి వెళ్లిన తర్వాత ఆంబులెన్స్‌కు నాలుగు సింహాలు ఎదురయ్యాయి. చుట్టూ సింహాలు నడుమ ఆంబులెన్స్..దీనితో ఏమి చేయాలో తెలియని డ్రైవర్ వాహనాన్ని అక్కడే నిలిపి ఉంచాడు. ఈ సమయంలో ఆ వ్యాన్ లోపల ఉన్న గర్భిణీకి పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి.

ఓ వైపు ఆంబులెన్స్ కదలడానికి వీళ్లేకుండా సింహాలు తిష్టవేసుకుని కూర్చున్నాయి. ఆస్పత్రికి వెళ్లేందుకు మరో దారి కూడా లేదు. దీంతో ఆంబులెన్స్‌ లో ఉన్న అత్యవసర సిబ్బందే .. అన్నీ తామే అయి పురుడు పోశారు. ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం పూర్తయిన తర్వాత కూడా తల్లీ, బిడ్డను ఆస్పత్రికి తరలించేందుకు ఆంబులెన్స్ సిబ్బంది సిద్ధమయ్యారు. కానీ దాదాపు అరగంటపాటు సింహాలు అక్కడి నుంచి కదలలేదు. చివరకు అవి వెళ్లిపోయిన తర్వాత తల్లీ, బిడ్డను ఆస్పత్రికి చేర్చారు. వారిద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు..