Begin typing your search above and press return to search.

అక్రమ సంబంధం అనుమానం.. బీజేపీ మహిళా నేతపై కాల్పులు

By:  Tupaki Desk   |   10 Feb 2020 11:10 AM IST
అక్రమ సంబంధం అనుమానం.. బీజేపీ మహిళా నేతపై కాల్పులు
X
దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ మహిళా నేతపై కాల్పులు కలకలం సృష్టించాయి. గురుగ్రామ్ లోని బీజేపీ మహిళా నేత ఇంటిలోనే ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పులకు పాల్పడింది ఎవరో కాదు.. ఆమె భర్త సునీల్ గోధారా.. చుట్టుపక్కల వారు వచ్చి చూసేసరికి బీజేపీ మహిళా నేత మునేష్ గోధరా విగత జీవిగా రక్తపు మరకల్లో పడి ఉంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆమె భర్త కోసం గాలిస్తున్నారు.

2001లో మునేష్-సునీల్ జంటకు వివాహమైంది. సునీల్ గురుగ్రామ్ లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తుండగా.. మునేష్ గోధారా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తున్నారు. అయితే దంపతుల మధ్య కొంతకాలంగా విభేదాలు తలెత్తినట్టు తెలిసింది.

తరచూ భార్య ఫోన్లో మాట్లాడుతుండడాన్ని జీర్ణించుకో లేని సునీల్ ఆమెకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. గన్ తో ఆమో ఛాతిపై కాల్చి చంపాడు.

అయితే తమ కూతురు కు ఎలాంటి వివాహేతర సంబంధాలు లేవని.. సునీల్ అన్యాయంగా చంపేశారని వారు ఆరోపించారు. సునీల్ సహా ఇద్దరి పై కేసు నమోదు చేశామని తెలిపారు.