Begin typing your search above and press return to search.

కామపిశాచిలా భర్త..లాక్ డౌన్ ఎత్తేయాలని మహిళ ఫిర్యాదు!

By:  Tupaki Desk   |   18 April 2020 4:00 AM IST
కామపిశాచిలా భర్త..లాక్ డౌన్ ఎత్తేయాలని మహిళ ఫిర్యాదు!
X
ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చిదంటే ఇదే మరీ.. లాక్ డౌన్ ఎఫెక్ట్ ఇప్పుడు మహిళలకు సెక్స్ నరకం చూపిస్తోందట.. అవును మన దేశంలో ఇంకా బయటపడలేదు కానీ.. ఆఫ్రికాలోని ఘనా దేశంలో లాక్ డౌన్ తో ఇంట్లో ఉన్న తన భర్త టూమచ్ గా సెక్స్ చేస్తున్నాడని.. తట్టుకోలేకపోతున్నానని.. వెంటనే లాక్ డౌన్ ను ఎత్తివేసి పనులకు పంపాలని ఆదేశ అధ్యక్షుడిని వీడియోలో ఓ మహిళ వేడుకున్న వింత సంఘటన వెలుగుచూసింది.. ఈ వీడియో వైరల్ కావడంతో ప్రపంచమంతా ఇప్పుడు ఆ మహిళ ఆవేదన చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తున్నారు.

కరోనా ఆఫ్రికా దేశాలకు పాకి అల్లాడిస్తోంది. దీంతో అక్కడి దేశాలు లాక్ డౌన్ విధించాయి. ఆఫ్రికన్ దేశమైన ఘనా కూడా ఏప్రిల్ మొదటివారం నుంచి లాక్ డౌన్ విధించింది. కంపెనీలు - పరిశ్రమలన్నీ మూసివేసింది. దీంతో మగాళ్లంతా ఇంటికే పరిమితమయ్యారు. ఖాళీగా ఉన్న వీళ్లంతా కామపిశాచ్చుల్లా ప్రవర్తిస్తున్నారని ఆ దేశ మహిళలు వాపోతున్నారు. రోజంతా సెక్స్ సెక్స్ అంటూ భార్యలను వేధిస్తున్నారట.. దీంతో ఓ ఆఫ్రికన్ మహిళ భర్త సెక్స్ పిచ్చికి విసిగిపోయి పారిపోయి ఆ దేశ అధ్యక్షుడికి వీడియోలో సందేశం పంపింది.

‘తన భర్త పొద్దస్తమానం సెక్స్ కోసం వెంపర్లాడుతున్నాడని.. నిద్ర లేచింది మొదలు.. సెక్స్ చేస్తూ.. వంట తర్వాత.. తిన్న తర్వాత.. టీవీ చూశాక.. ఏ మాత్రం గ్యాప్ వచ్చినా సెక్స్ చేస్తూ ప్రాణం తీస్తున్నాడని’ వీడియో లో వాపోయింది. లాక్డౌన్ వేళ ఇంట్లో ఖాళీగా ఉంటూ విపరీతంగా శృంగారం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా వైరస్ తో లాక్ డౌన్ తమ ప్రాణాల మీదకొచ్చిందని.. వెంటనే దేశంలో లాక్ డౌన్ ఎత్తివేసి పురుషులను పనులకు పంపాలని కోరింది. ఇది తన ఒక్కదానికి సమస్యే కాదని.. ఘనా దేశంలోని మహిళలందరూ నరకయాతన పడుతున్నారని తెలిపింది. ఆ వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది.

కాగా భారతదేశంలోనూ ఖాళీగా ఉన్న పురుషులు మహిళలపై వేధింపులు ఎక్కువయ్యాయని ఫిర్యాదులు వెల్లువెత్తాయి.లాక్ డౌన్ లో మహిళలపై 50శాతం వేధింపులు ఎక్కువయ్యాయని నివేదిక తేల్చింది. దీంతో జాతీయ మహిళా కమిషన్ వేధింపులపై 7217735372 అనే వాట్సాప్ నంబర్ ను మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేయడం విశేషం.

ఇలా లాక్ డౌన్ తో కరోనా వైరస్ కట్టడి ఏమోకానీ.. పురుషుల సెక్స్ దాహానికి పాపం మహిళలు బలి అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది..