Begin typing your search above and press return to search.

ఛీ..ఛీ: గుడిలో సాధ్విపై గ్యాంగ్ రేప్‌

By:  Tupaki Desk   |   16 Sep 2017 5:41 AM GMT
ఛీ..ఛీ: గుడిలో సాధ్విపై గ్యాంగ్ రేప్‌
X
మృగాలు కూడా చేయ‌ని పాడు ప‌నిని తాజాగా కొంద‌రు మృగాళ్లు చేసిన వైనం కాస్త ఆలస్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో చోటు చేసుకున్న ఈ దారుణం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. ప్ర‌ముఖ దేవాల‌య‌మైన మ‌థుర స‌మీపంలోని ఒక గుడిలో ఉన్న సాధ్విని కొంద‌రు కామాంధులు గ్యాంగ్ రేప్‌ న‌కు పాల్ప‌డటం స‌భ్య స‌మాజాన్ని సిగ్గుతో త‌ల‌దించుకునేలా చేస్తోంది.

మ‌థుర స‌మీపంలోని బ‌ర్సానా శ్రీజి దేవాల‌యంలో ఈ నెల 11న రాత్రివేళ‌లో గుడి బాల్క‌నీలో ఒక సాధ్వి నిద్ర‌పోతోంది. 45 ఏళ్ల సాధ్వీ నిద్ర‌పోతున్న వేళ‌.. గుడి వాచ్ మ‌న్‌.. ఆల‌య సిబ్బంది ఆమెను బ‌ల‌వంతంగా వేరే చోట‌కు లాక్కెళ్లారు. ఆమె తీవ్రంగా ప్ర‌తిఘ‌టిస్తున్నా ప‌ట్టించుకోని వారు.. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు.

త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై బాధితురాలు పోలీసుల‌కు మొర‌పెట్టుకున్నారు. దారుణ‌మైన విష‌యం ఏమిటంటే.. బాధితురాలు ఈ నెల 13న పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తే.. 14న కేసును న‌మోదు చేశారు. బాధితుల గోడుపై స్పందించేందుకే పోలీసుల‌కు 24 గంట‌ల స‌మ‌యం ప‌ట్ట‌టంపై ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.