Begin typing your search above and press return to search.

టెన్నిస్ క్లబ్ కు వెళ్లినా రేప్ చేసేశారే?

By:  Tupaki Desk   |   12 Nov 2015 8:58 AM GMT
టెన్నిస్ క్లబ్ కు వెళ్లినా రేప్ చేసేశారే?
X
గార్డెన్ సిటీగా పేరొందిన బెంగళూరులో మరో దారుణం చోటు చేసుకుంది. ఈ మధ్యన కదిలే బస్సులో ఒక నర్సింగ్ విద్యార్థిని రేప్ చేయటం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ షాక్ నుంచి తేరుకోక ముందే.. మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. టెన్నిస్ క్లబ్ లో సభ్యత్వం తీసుకోవటానికి వెళ్లిన ఒక మహిళను అక్కడి సెక్యూరిటీ గార్డులు అత్యాచారం చేయటం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

మెట్రో లుక్.. కాస్మో కల్చర్ తో బెంగళూరు పేరు ప్రఖ్యాతులకు ఈ రేప్ ఉదంతాలు మాయని మచ్చలా మారుతున్నాయి. టెన్నిస్ క్లబ్ లోసభ్యత్వ నమోదు కోసం 30 ఏళ్ల మహిళ ఒకరు క్లబ్ కు వెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత మహిళ పోలీసుల్ని ఆశ్రయించి తనపై జరిగిన లైంగిక దాడి గురించి ఫిర్యాదుచేయటంతో పోలీసులు కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టారు. రోజురోజుకీ పెరుగుతున్న ఈ అత్యాచార ఉదంతాలు బెంగళూరు వాసుల్లో భయాన్ని పెంచేస్తున్నాయి.