Begin typing your search above and press return to search.

ఏది సీజనల్ వ్యాధి? ఏది కరోనా? క్లారిటీ ఇదే

By:  Tupaki Desk   |   24 July 2020 11:30 PM GMT
ఏది సీజనల్ వ్యాధి? ఏది కరోనా? క్లారిటీ ఇదే
X
ఓ వైపు కరోనా కమ్మేస్తోంది. మరోవైపు వానాకాలం సీజన్ వ్యాధులు ముసురుతున్నాయి. కరోనా భయంతో ఆస్పత్రులన్నీ బంద్ అయిపోయాయి. కేవలం కరోనా ట్రీట్ మెంట్ కు మాత్రమే పరిమితమయ్యాయి. ఆర్ఎంపీలు.. పీఎంపీలు అంత కరోనా భయానికి చికిత్సను ఆపేశారు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు వానాకాలం రోగాలకు.. కరోనా రోగానికి పెద్దగా తేడా లేకుండా పోయిన దైన్యం కనిపిస్తోంది. రెండూ ఒకేలా ఉండడంతో దేన్ని ఏ రోగమో కనిపెట్టలేకపోతున్నారు. దీంతో కంగారు పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

సాధారణంగా సీజన్ వ్యాధుల్లో జ్వరం 3 రోజుల్లో తగ్గుతుంది.. ముక్కు కారుతుంది. కఫంతో కూడిన దగ్గు.. రుచి, వాసన తెలుస్తుంది. ఒళ్లు, తల, గొంతునొప్పి సాధారణంగా ఉంటాయి. ఛాతినొప్పి ఉంటుంది. కళ్లు ఎర్రబడవు.. వాంతలు, విరేచనాలు ఉంటాయి.

ఇక కరోనా లక్షణాలు చూస్తే.. తీవ్ర జ్వరం ఉంటుంది.. 3 రోజులైనా తగ్గదు. జలుబు ఉన్నా ముక్కు కారదు. పొడి దగ్గు.. రుచి, వాసన తెలియదు.. ఒళ్లు, తల, గొంతు నొప్పి తీవ్రంగా ఉంటాయి. ఛాతిలో నొప్పి వస్తుంటుంది.. కళ్లు ఎర్రబడతాయి.. వాంతులు విరేచనాలు అవుతుంటాయి.

ఈ లక్షణాలు పరిశీలించి అది కరోనానా? లేక సాధారణ జ్వరాలా తెలుసుకొని చికిత్స తీసుకుంటే బెటర్ అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.