Begin typing your search above and press return to search.
దగ్గుతో కరోనా లెక్క తేల్చే సరికొత్త ఆయుధం వచ్చేసిందట
By: Tupaki Desk | 19 Sept 2020 5:00 AM ISTఎంతకూ కొరుకుడుపడని కరోనా వైరస్ గుట్టు తేల్చేందుకు వందకు పైగా సంస్థలు వ్యాక్సిన్ తయారీ విషయంలో పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. కరోనా సోకిందా? లేదా? అన్న విషయాన్ని తేల్చటానికి ఇప్పటికే పలు పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. అయితే.. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవి మాత్రమే కాదు.. పెద్ద ఎత్తున కిట్లు అవసరమవుతున్నాయి. ఇలాంటివేళ.. ఇందుకు భిన్నమైన ఆయుధాన్ని మనోళ్లు తయారు చేసినట్లుగా చెబుతున్నారు.
ముంబయికి చెందిన వధ్వానీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో ఒక కొత్త టూల్ ను రూపొందించారు. దీని ప్రత్యేకత ఏమంటే.. దగ్గేటప్పుడు వచ్చే శబ్ధం ఆధారంగా కోవిడ్ ఉందో లేదో అన్న విషయాల్ని తేల్చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు సాంకేతికతను ఉపయోగించి దీన్ని రూపొంచిందారు. ఈ టూల్ కు ఇప్పటికే అమెరికా నుంచి పేటెంట్ లభించినట్లు చెబుతున్నారు.
కరోనా వేళ.. సాధారణ దగ్గుకు.. కరోనా దగ్గుకు తేడా గుర్తించటం కష్టం కావటంతో పాటు.. పరీక్షలు జరపటం కష్టంగా మారింది. దీన్ని మరింత సులువు చేయటంతో పాటు.. అందుబాటులో ఉన్న సాంకేతికత ఆధారంగా ఈ టూల్ ను రూపొందించారు. దీని సాయంతో ఎలాంటి అదనపు వసతులు.. మానవ వనరులు అవసరం లేకుండానే దేశంలో చేపట్టే కొవిడ్ పరీక్షల్లో 43 శాతాన్ని ఈ టూల్ తో నిర్వహించే వీలుంది.
నార్వే -ఇండియా సంయుక్త భాగస్వామ్యంలో ఈ టూల్ ను రూపొందించారు. దీన్ని ప్రయోగాత్మకంగా పలు రాష్ట్రాల్లో (బిహార్.. ఒడిశా.. రాజస్థాన్.. మహారాష్ట్ర) పరీక్షలు జరిపారు. దీని పని తీరు బాగున్నట్లుగా తేల్చారు. నాలుగు రాష్ట్రాల్లో 3621 మంది నుంచి దగ్గు శబ్ధాన్ని సేకరించారు. తాము రూపొందించిన టూల్ సాయంతో వారిలో 2041 మందికి కరోనా ఉన్నట్లుగా తేల్చారు. దీంతో ఈ టూల్ రానున్న రోజుల్లో కరోనా నిర్దారణ పరీక్షలు మరింత సులువు కావటం ఖాయం.