Begin typing your search above and press return to search.
కోహ్లీ ట్వీట్ తో ఫ్యాన్స్ కు ఎక్కడో కాలింది..అందుకే అంతలా కౌంటర్లు!
By: Tupaki Desk | 15 Nov 2020 2:20 PM ISTదీపావళి సందర్భంగా విరాట్ కోహ్లీ పెట్టిన ఓ ట్వీట్ బెడిసికొట్టింది. ఫలితంగా నెటిజన్ల నుంచి విరాట్‌కు ఊహించని రీతిలో కౌంటర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఐపీఎల్లో ఓడిపోవడంతో కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తాయి. కోహ్లీ టీంఇండియా కెప్టెన్‌గా పనికిరాడంటూ కొందరు కామెంట్లు పెట్టారు. తాజాగా కోహ్లి పెట్టిన ఓ ట్విట్ తో నెటిజన్లకు చిర్రెత్తింది. ఇంతకీ కోహ్లీ పెట్టిన ట్వీట్ ఏంటంటే.. ‘ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.. పర్యావరణాన్ని కాపాడేందుకు ఈ సారి ఎవరూ క్రాకర్స్ కాల్చకండి’ అంటూ ట్వీట్ పెట్టారు. ఈ ట్విట్ తో ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ఇటీవల ఐపీఎల్ సీజన్ కొనసాగుతుండగానే కోహ్లీ పుట్టినరోజు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆర్సీబీ యజమాన్యం పెద్ద ఎత్తున టపాసులు కాల్చింది. అందుకు సంబంధించిన వీడియోలు కూడా షేర్ చేశారు.
ఫ్యాన్స్ ఏమంటున్నారంటే.. నీ పుట్టినరోజుకు టపాసులు కాల్చితే పర్యావరణానికి ఏం హానీ కలగదు. కానీ హిందువులు తమ పండక్కి టపాసులు కాల్చితే ఇబ్బంది వచ్చిందా అంటూ కౌంటర్లు వేస్తున్నారు. దీనికి తోడు బర్త్‌డే వేడుకల ఫొటోలను, వీడియోలను వాళ్లు షేర్ చేస్తున్నారు. ‘ విరాట్ చెప్పేవి శ్రీరంగనీతులు.. చేసేది చెత్త పనులా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
తన 32వ జన్మదిన వేడుకలను విరాట్ దుబాయ్‌లో భార్య అనుష్క శర్మ, బెంగళూరు టీమ్ మేట్స్‌తో కలిసి బోట్ లో జరుపుకున్నాడు. కోహ్లీకి విషెస్ చెప్తూ.. ఆర్‌సీబీ యాజమాన్యం పెద్ద ఎత్తున తారాజువ్వల్ని - క్రాకర్స్‌ను కాల్చింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారాయి. మీరు కార్లో వాడే ఏసీలు - ఇంట్లో వాడే ఏసీతో కూడా పర్యావరణం దెబ్బతింటుంది. దాని కూడా మానేయ్ అంటూ మరికొందరు ట్వీట్లు పెట్టారు. సెలెబ్రిటీలందరికి పండుగపూట ఇలా సలహాలు ఇవ్వడం ఓ ఫ్యాషన్ అయిపోయిందని విసుక్కుంటున్నారు. క్రికెట్ మైదానాలు - బ్యాట్ల కోసం చెట్లు నరకుతున్నారు. నీటిని వృథా చేస్తున్నారు. ఐపీఎల్ లోనూ పటాసులు కాల్చుతున్నారని కామెంట్స్ పెడుతున్నారు.