Begin typing your search above and press return to search.
ఫ్రీ కరెంట్ - ఎస్సి - ఎస్టీలకు నెలకు రూ.1000...దీదీ మరో సంచలనం!
By: Tupaki Desk | 12 Feb 2020 12:45 PM ISTపశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేరు దేశ రాజకీయాలలో నిత్యం మారుమోగిపోతూనే ఉంటుంది. అక్కడ కమలం పార్టీ నేతలు అధికారం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా వారి వ్యూహాలకి చెక్ పెడుతూ దీదీ సరికొత్త పథకాల్ని ప్రవేశపెడుతూ పశ్చిమ బెంగాల్ ప్రజలని ఆకట్టుకుంటూ అధికారంలో కొనసాగుతోంది. దేశ రాజకీయాలలో దీదీ ఓ ఫైర్ బ్రాండ్. ఆమెని గద్దె దించాలని బీజేపీ చేసిన ప్రతి ప్రయత్నం కూడా విఫలం అవుతూనే ఉంది. దీనికి కారణం ఆమె మార్క్ రాజకీయాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోడమే.
ఇకపోతే , తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో పేదలకు వరాల జల్లు కురిపించింది. ఈ బడ్జెట్ లో ముఖ్యంగా పేదవారికి ఉచిత విద్యుత్ ను అందిచబోతున్నట్టు ప్రకటించింది. అయితే ఇది కేవలం 3 నెలల్లో 75 యూనిట్లు వినియోగించే వారికి మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. అలాగే పేదవారికి ఉచిత విద్యుత్ అందించే పథకం కోసం తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో రూ.200 కోట్లు కేటాయించారు. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గానూ రూ. 2,55,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం.. ఎమ్ ఎస్ ఎమ్ ఈ పార్కులు, ఉద్యోగల కల్పన కోసం సుమారు రూ.5,000 కోట్లను కేటాయించింది.
అలాగే ఎస్సి, ఎస్టీ వాళ్లకు కూడా పెన్షన్ స్కీంను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా వృద్దులకు ప్రతీనెలా రూ.1000 ఇవ్వనున్నారు. ప్రజలపై దీదీ సర్కార్ వరాలజల్లు కురిపించాడు ప్రధాన కారణం ..వచ్చే ఏడాదిలో పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలని ఆకట్టుకునే ప్రయత్నం దీదీ అప్పుడే మొదలుపెట్టింది అని కొందరు అభిప్రాయ పడుతున్నారు. కాగా , వచ్చే ఏడాది లో ఎన్నికలు జరగనున్న నేపథ్యం లో దీదీ సర్కార్ ప్రవేశ పెట్టే చివరి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే. మళ్లీ ఎన్నికల తరువాత దీదీ సర్కార్ ఏర్పడితే మరోసారి పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశ పెట్టే అవకాశం ఉంటుంది.