Begin typing your search above and press return to search.
త్వరలో వైరలెస్ చార్జింగ్ .. షావోమి ప్రయోగాలు..
By: Tupaki Desk | 31 Jan 2021 6:00 AM ISTమొబైల్ దిగ్గజ కంపెనీ షావోమి నూతన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ఎయిర్ చార్జింగ్ టెక్నాలజీని ప్రవేశపెట్టబోతున్నది. ప్రస్తుతం ఇది ఇంకా ప్రయోగదశల్లోనే ఉంది. ప్రస్తుతం ఫోన్ చార్జింగ్ పెట్టాలంటే కనీసం అరగంట.. 45 నిమిషాలు పడుతుంది. ఈ నేపథ్యంలో మరింత వేగంగా చార్జింగ్ చేసుకొనేందుకు షావోమీ ఈ కొత్త టెక్నాలజీని తీసుకురాబోతున్నది. ప్రస్తుతం కొన్ని మొబైల్ కంపెనీలు ఫాస్ట్చార్జింగ్, వైరలెస్ చార్జింగ్ను తీసుకొచ్చాయి. అయితే షావోమి మాత్రం మరో కొత్త టెక్నాలజీని తొలిసారి అందుబాటులోకి రానున్నారు.
ప్రస్తుతం చార్జింగ్ పెట్టాలంటే కచ్చితంగా కేబుల్, అడాప్టర్ ఉండాల్సిందే. అయితే షావోమి ప్రవేశపెట్టబోయే కొత్త టెక్నాలజితో వైర్లెస్ చార్జింగ్ను తీసుకురాబోతున్నది.
నాలుగు సెంటీమీటర్ల పరిధి వరకు వైర్లెస్ సరఫరా చేయనున్నది.ఈ కొత్త టెక్నాలజీ సాయంతో ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ డివైజ్లను చార్జ్ చేసుకోవచ్చు. ఎయిర్ చార్జర్లో దిమ్మె లాంటి వస్తువు ఉంటుంది. అందులో ఐదు యాంటినాలు ఉంటాయి. అవి పవర్ని తరంగాల ద్వారా స్మార్ట్ఫోన్కు అందజేస్తాయి.
అయితే ప్రస్తుతం ఈ విధానం ఇంకా ప్రయోగదశల్లోనే ఉంది. ఈ తరహా చార్జింగ్ ద్వారా ఆరోగ్యసమస్యలు తలెత్తే అవకాశం ఉందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రయోగాలు పూర్తయ్యాకే ఈ కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తామని షావోమి ప్రకటించింది.ఎయిర్ చార్జింగ్ టెక్నాలజీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని షావోమి వినియోగదారులు కూడా ఆసక్తి చూపుతున్నారు.