Begin typing your search above and press return to search.

గొడుగులు వేసుకొని మరీ ఏపీలోకి వచ్చేస్తున్నారట

By:  Tupaki Desk   |   11 May 2020 10:00 AM IST
గొడుగులు వేసుకొని మరీ ఏపీలోకి వచ్చేస్తున్నారట
X
అన్ని బంద్ అయిన ప్రత్యేక పరిస్థితుల్లో మద్యం అమ్మకాలు సైతం బంద్ అయ్యాయి. దాదాపు ఏడు వారాల తర్వాత దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మద్యం అమ్మకాల్ని షురూ చేశారు. మామూలుగా అమ్మే రేట్లకు 75 శాతం అదనంగా వసూలు చేస్తున్నా మందుబాబులు మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు. దేశంలోని పలు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలకు ఓకే చెప్పినప్పటికీ.. తక్కువ బాదుడుతో మద్యాన్ని అమ్ముతున్న క్రెడిట్ మాత్రం తెలంగాణ రాష్ట్రానికే చెందుతుందని చెప్పాలి.

మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో నిలిపివేయటంతో మందుబాబు తీవ్ర అవస్థలకు గురయ్యారు. తమ కష్టాలకు చెక్ చెప్పేలా ప్రభుత్వ తీసుకున్న నిర్ణయానికి సంతోషించారు. వీధుల్లోకి పోటెత్తారు. కిలోమీర్ల కొద్దీ క్యూలో నిలుచొని మరీ తమకు అవసరమైన మందు బాటిల్స్ ను కొనుగోలు చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మద్యం అమ్మకాల్ని నేటికి లేని రాష్ట్రాల్లోని ప్రజల పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్న.

ఏపీలో మద్యం అమ్మకాలను షురూ చేస్తే.. ఆ రాష్ట్రానికి పక్కనే ఉన్న తమిళనాడులో సిత్రమైన పరిస్థితి ఉంది. అక్కడ మద్యం అమ్మకాలు ఇంకా షురూ కాలేదు. ఏపీ సరిహద్దుల్లోనే తమిళనాడు సరిహద్దులు చాలా మేరకు ఉంటాయి. దీంతో.. తమిళనాడుకు చెందిన పలువురు ఏపీకి పోటెత్తుతున్నారు. సరిహద్దుల్ని దాటేసి.. ఏపీలోని మద్యం దుకాణాల వద్ద కిలోమీటర్ల కొద్దీ క్యూలో ఉంటూ తమకు తోచింది కొనుక్కొని పోతున్నారు.

తమిళనాడులో మద్యం అమ్మకాలపై పరిమితులు ఉండటంతో.. సరిహద్దు ప్రాంతాల్లోని తమిళులంతా ఏపీ బాట పట్టారు. చేతుల్లో గొడుగులు తీసుకొని బయలుదేరిన వారు.. ఏపీ సరిహద్దుల్లోని మద్యం దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. కిలోమీటర్ల కొద్దీ ఉన్న ఈ క్యూలైన్లను చూసిన తర్వాతైనా.. తాము మద్యం అమ్మకాల్ని షురూ చేయకుంటే రాష్ట్రానికి జరిగే ఆర్థిక నష్టాన్ని పళని సర్కారు లెక్కలు వేసుకోవటం ఖాయమంటున్నారు.