Begin typing your search above and press return to search.

వేల కి.మీ సముద్రంలో పయనించిన వైన్ బాటిల్!

By:  Tupaki Desk   |   26 Aug 2021 6:00 AM IST
వేల కి.మీ సముద్రంలో పయనించిన వైన్ బాటిల్!
X
సాధారణంగా మనుషులు మాత్రమే వేల కిలోమీటర్లు బస్సులోనో లేదా ఇంకా ఇతర వెహికల్‌లోనో ప్రయాణిస్తారని మనందరికీ తెలుసు. కానీ, అలా కాకుండా ఓ వైన్ బాటిల్ కూడా వేల కిలోమీటర్లు పయనిస్తుందన్న సంగతి మీకు తెలుసా.. అలా పయనించిందని చెప్తే మీరు నమ్ముతారా.. నమ్మబోరు. అదేలా సాధ్యం అనుకుంటారు. కదా.. కానీ, అది నిజమేనండోయ్.. ఓ వైన్ బాటిల్ సముద్రమార్గానా వేలి కిలోమీటర్లు పయనించింది.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4,500 కిలోమీటర్ల దూరం వైన్ బాటిల్ పయనించింది. అది ఎలా తెలిసిందంటే.. ఇంగ్లాండ్ దేశంలోని వేల్స్ తీరానికి వెళ్లింది 52 ఏళ్ల అమందా టిడ్ మార్ష్.. ఈ క్రమంలోనే ఆమె అలా తీరంలో వెళ్తుండగా, ఆమెకు ఒక వైన్ బాటిల్ కనిపించింది. దాన్ని చూడగానే థ్రిల్ అయిన ఆమె ఇక్కడికి వైన్ బాటిల్ ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయింది. ఈ నేపథ్యంలోనే వెంటనే ఆమె ఆ బాటిల్‌ను ఇంటికి తీసుకెళ్లింది. నిజానికి అమందా తన రెండు కుక్కలతో సరదాగా బీచ్‌లో తిరుగుతుండగా, అనుకోకుండా ఆ బాటిల్‌ను గమనించింది.

ఆ వైన్‌బాటిల్‌ను చూస్తేనే అది చాలా ఏళ్ల నుంచి సముంద్రంలో ఉందని అర్థమయిపోయింది ఆమెకు. ఇక ఆ బాటిల్‌ను ఇంటికి తీసుకెళ్లిన టిడ్ మార్ష్ ఓ అరుదైన వస్తువు తనకు దొరికిందని సంబురపడిపోయింది. ఈ క్రమంలోనే దానిని ఫొటోలు తీసి సదరు మహిళ కుటుంబ సభ్యులు సంబురపడిపోయారు. ఈ క్రమంలోనే అమందా.. బాటిల్ ఓపెన్ చేసి చూసింది. అందులో ఏమీ లేవు. వైన్ అస్సలు లేదు. కానీ, ఓ చిరిగిన లెటర్ ఉండగా, దాన్ని ఓపెన్ చేసి చదివే ప్రయత్నం చేశారు. అందులో కొన్ని వివరాలతో పాటు దయచేసి ఈ బాటిల్ మీకు అందినట్లుగా ఈ కింది ఈమెయిల్-ఐడీకి సమాచారం పంపండని లెటర్‌లో రాసి ఉంది.

ఆ బాటిల్ చూస్తేనే తనకు థ్రిల్‌గా అనిపించిందని చెప్పింది అమందా. ఇంకా ఇలా రాసి ఉండటం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. లెటర్‌లో ఉన్న వివరాల ప్రకారం.. ఆ వైన్ బాటిల్‌ను కెనడాలో సముద్రంలో వదిలేసినట్లు అర్థమవుతుంది. జాన్ గ్రాహమ్ అనే వ్యక్తి 2020 నవంబర్‌లో ఆ బాటిల్‌ను సముద్రంలోకి విసిరేశాడట. అలా ఆ బాటిల్ 4,800 కిలోమీటర్స్ ప్రయాణించి టిడ్ మార్ష్ అనే మహిళ వద్దకు చేరుకుంది. అయితే, అతడికి టిడ్ మార్ష్ వైన్ బాటిల్ దొరికినట్లు మెయిల్ చేసింది. కానీ, అటు నుంచి ఎటువంటి రిప్లయి రాలేదు. ఈ విషయాలన్నిటినీ తలచుకుని ఇలాంటి సంఘటన తన జీవితంలో మళ్లీ మళ్లీ జరగబోదని అనుకుంది.

సెకండ్ వరల్డ్ వార్ సందర్భంగా యుద్ధాల్లో పాల్గొన్నవారు చనిపోయే ముందు పేపర్లలో విషయం రాసి వాటిని వైన్ లేదా ఇతర బాటిల్స్‌లో పెట్టి సంద్రంలోకి విసిరేసేవారట. ఈ క్రమంలోనే ఆ లెటర్స్ ఆధారంగా పలు విషయాలు తెలిసి వచ్చేవి. సినిమాలలో మాదిరిగా ఫిక్షనల్ ఇన్సిడెంట్ ఇది అంటూ విషయం తెలుసుకున్న నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఇలా వైన్ బాటిల్ నిజంగానే వేల కిలోమీటర్ల ప్రయాణించడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వైన్ బాటిల్ జాడ తెలియకుండా పోతుందనే సముద్రంలో విసిరేసే ముందర జాన్ గ్రాహమ్ అనుకున్నాడో లేదో కానీ ఇప్పుడు ఆ వైన్ బాటిల్ జాడ దొరికింది.