Begin typing your search above and press return to search.

పోలండ్ నుండి ఉక్రెయిన్ను పాలిస్తారా ?

By:  Tupaki Desk   |   7 March 2022 5:49 AM GMT
పోలండ్ నుండి ఉక్రెయిన్ను పాలిస్తారా ?
X
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం 12వ రోజుకు చేరుకుంది. ఈ 12 రోజుల్లో ఉక్రెయిన్లోని కీలకమైన నగరాల్లోని చాలా ప్రాంతాలు దాదాపు ధ్వంసం అయిపోయాయి. రాజధాని కీవ్ లోకి మాత్రం రష్యా సైన్యం ప్రవేశించకుండా బయటే వెయిట్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే కీవ్ లోకి రష్యా సైన్యం ప్రవేశించటానికి ఎన్నోరోజులు పట్టదని అందరికీ తెలిసిపోయింది. అసలు ఇప్పటికే కీవ్ లోకి ప్రవేశించుండాల్సింది.

అయితే ఏదో వ్యూహం కారణంగానే గడచిన వారం రోజులుగా కీవ్ చుట్టుపక్కల ప్రాంతాలను దిగ్బంధం చేసింది రష్యా. దీంతో ఏ క్షణంలో అయిన రష్యా సైన్యం కీవ్ లోకి ప్రవేశించటం ఖాయమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో పాటు అమెరికా, బ్రిటన్ నాటో దేశాలు అనుమానిస్తున్నాయి. అందుకనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని దేశం విడిచి వచ్చేయమని పదే పదే హెచ్చరిస్తున్నాయి.

ఉక్రెయిన్ నుండి పొరుగునే ఉన్న పోలండ్ దేశంలోకి వెళ్ళిపోవాలంటు గట్టిగా వార్నింగులు కూడా ఇస్తున్నాయి. అయితే జెలెన్ స్కీ నిర్ణయం ఏమిటో మాత్రం బయటపడలేదు. దాదాపు వారం రోజుల క్రితమే దేశం విడిచి అమెరికాకు వచ్చేయమని అమెరికా హెచ్చరించింది.

జెలెన్ స్కీని తీసుకొచ్చేందుకు అమెరికా అన్నీ ఏర్పాట్లూ చేసింది. అయితే అప్పట్లో అమెరికా వార్నింగును అధ్యక్షుడు పట్టించుకోలేదు. తాను దేశం వదిలి బయటకు వచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

అయితే తాజా పరిస్థితుల్లో రష్యా సైనికుల దాడిలో చనిపోవటమో లేకపోతే బంధీగా చిక్కటమో ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. నిజానికి అధ్యక్షుడు దేశ రాజధాని కీవ్ లోనే ఉన్నాడా ? లేకపోతే ఇంకెక్కడైనా బంకర్లో దాక్కున్నాడా కూడా ఎవరికీ తెలీదు.

ఈ నేపధ్యంలోనే కనీసం పోలండ్ కు వచ్చేసి బయట నుండే దేశాన్ని నడిపించమని అమెరికా, బ్రిటన్ గట్టిగా చెబుతున్నాయి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను కూడా చేస్తున్నాయి. జెలెన్ స్కీతో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు, మిలిటరీ టాప్ క్లాస్ ఉన్నతాధికారులు కూడా పోలండ్ కు వెళ్ళేట్లుగా అమెరికా, బ్రిటన్ ఏర్పాట్లు చేస్తోంది. మరి అధ్యక్షుడు ఏమి చేస్తాడో చూడాలి.