Begin typing your search above and press return to search.
తండ్రినే ఫాలో అవుతున్న వైఎస్, ఆ మంత్రి పదవి విషయంలోనూ?
By: Tupaki Desk | 31 May 2019 5:39 PM ISTవైఎస్ జగన్ మోహన్ రెడ్డి హావభావల్లో పదే పదే వైఎస్ ను గుర్తు చేయడం ఆయనకున్న పెద్ద ప్లస్ పాయింట్. వైఎస్ మరణించాకా జగన్ మోహన్ రెడ్డి చాలా మందికి తన తీరుతో వైఎస్ నే గుర్తు చేశారు. ఇక పదేళ్ల పోరాటంతో వైఎస్ ఇమేజ్ ను మరింతగా సొంతం చేసుకున్నారాయన. ఈ క్రమంలో వైఎస్ లాగే ముఖ్యమంత్రి పదవిని కూడా సాధించుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించిన ఏకైక సీఎం తనయుడిగా జగన్ మోహన్ రెడ్డి రికార్డు సృష్టించారు.
ఇక ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా వరకూ వైఎస్ రాజశేఖర రెడ్డిని గుర్తు చేశారు. ప్రమాణ స్వీకారోత్సవ వేదికకు జనం మధ్య నుంచి ఓపెన్ టాప్ జీప్ లో రావడం, ప్రజలకు అభివాదం చేసిన తీరు వంటి వన్నీ వైఎస్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని గుర్తు చేశాయి. వైఎస్ ధరించిన వాచ్ నే జగన్ ధరించి తండ్రిని మరింతగా గుర్తు చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి.మరి ఇతర సెంటిమెంట్లను కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫాలో అయ్యే అవకాశాలున్నాయా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
పాలన విషయంలో కూడా జగన్ మోహన్ రెడ్డి చాలా వరకూ వైఎస్ నే గుర్తు చేస్తున్నారు. వైఎస్ హయాంలో వెలిగిన ఐఏఎస్ లకు, ఇతర ఉన్నతాధికారులకు జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు తన పాలనలో అవకాశం ఇస్తూ ఉన్నారు. నాటి ఐఏఎస్ లు ఇంకా సర్వీస్ లో ఉన్న వారికి ఇప్పుడు కీలక బాధ్యతలు దక్కుతున్నాయి. మరి కీలకమైన మంత్రి వర్గం ఏర్పాటు విషయంలో కూడా జగన్ మోహన్ రెడ్డి వైఎస్ నే ఫాలో అవుతారా? అనేది ఇప్పుడు ఆసక్తిదాయకంగా మారింది.
అదెలాగంటే.. తన రెండో దఫా పాలనలో హోం మంత్రి పాలనలో హోం మంత్రి పదవిని 'చేవెళ్ల చెల్లెమ్మ' సబితా ఇంద్రారెడ్డికి ఇచ్చారు రాజశేఖర రెడ్డి. అంతవరకూ ఏపీ చరిత్రలో మహిళా హోంమంత్రి లేనే లేరు. అప్పుడు వైఎస్ నిర్ణయం ఆశ్చర్యపరిచింది. అదే రీతిన ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కూడా వైఎస్ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ మహిళకే హోం మినిస్టర్ పదవిని ఇస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. తండ్రి వలే నిర్ణయం తీసుకుంటే.. హోం మినిస్టర్ పదవి రేసులో ముందుంటారు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా! అటు చెల్లెమ్మ సెంటిమెంట్ తో, ఇటు మహిళ సెంటిమెంట్ తో ఆర్కే రోజా హోంమంత్రి అవుతారేమో చూడాలి!