Begin typing your search above and press return to search.
కేంద్రాన్ని జగన్ కమిట్ చేయించగలరా ?
By: Tupaki Desk | 14 Nov 2021 11:43 AM ISTరాష్ట్ర విభజన హామీలపై కేంద్రప్రభుత్వాన్ని ఏదో పద్దతిలో కమిట్ చేయించేందుకు జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిరంచనున్నారా ? అంటే పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీ అభివృద్ధికి అప్పటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేకహోదా, పోలవరం నిర్మాణం, వైజాగ్ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు లాంటి అనేక అంశాలు గాలికి కొట్టుకుపోయాయి. విభజన హామీలకు 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత నరేంద్రమోడి తూట్లు పొడిచేశారు.
దీనికి ప్రధాన కారణం చంద్రబాబునాయుడు చేతకానీతనమే. ఎలాగంటే 2014 నుండి నాలుగేళ్ళపాటు కేంద్రప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ రాష్ట్రప్రయోజనాలను సాధించటంలో పూర్తిగా విఫలమైంది. దాని దెబ్బ ఇపుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా కంటిన్యు అవుతోంది. రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్రం దృష్టిపెట్టాలంటే కేవలం రాజకీయ అనివార్యతల వల్లే సాధ్యం అవుతుంది. రాజకీయ అనివార్యత అంటే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే అందుకు మన రాష్ట్రం ఎంపీల మద్దతు అవసరమవ్వాలి.
అప్పుడు అధికారంలో ఉన్నపార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అనుకుంటున్న కూటమికి మద్దతివ్వాలంటే రాష్ట్రప్రయోజనాలకు అవసరమైన హామీని పొందటమే కాదు వెంటనే అమల్లోకి తెచ్చినపుడు మాత్రమే ప్రయోజనాలు నెరవేరుతాయి. లేకపోతే ఎన్ని దశాబ్దాలయినా ప్రయోజనాలు నెరవేరదు. హోదా, పోలవరంకు నిధులు లాంటి డిమాండ్లను జగన్ ఎన్నిసార్లు మోడి, అమిత్ షా లకు వినిపించినా లెక్కకూడా చేయటంలేదు. ఎందుకంటే ఏపీ ప్రయోజనాలు వాళ్ళకు పట్టడంలేదు కాబట్టే.
జగన్ ఢిల్లీకి వెళ్ళినపుడు మోడి, అమిత్ తో మాట్లాడటం కాదు ఇపుడు షా యే తిరుపతికి వచ్చారు. ధక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో జగన్ రాష్ట్రప్రయోజనాల డిమాండ్లపై మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్ల ముందు ప్రస్తావించబోతున్నట్లు సమాచారం. జగన్ ప్రస్తావనకు అమిత్ షా ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. మన రాష్ట్రానికి వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి ముందు అందరి సమక్షంలో మనకు అవసరమైన డిమాండ్లు పెట్టడం మామూలు విషయంకాదు.
సమావేశంలో రాష్ట్రప్రయోజనాల విషయంపై జగన్ ప్రస్తావించినపుడు అమిత్ ఏదో ఓ సమాధానమైతే చెప్పాల్సుంటుంది. ఆ సమాధానమే ఏమిటన్నది ఇపుడు ఆసక్తిగా మారింది. ఇప్పటికే రాష్ట్రప్రయోజనాలను కేంద్రప్రభుత్వం గాలికొదిలేసిందనే భావన జనాల్లో బలంగా నాటుకుపోయింది. అందుకనే ఏ ఎన్నికలో అయినా ప్రజలు బీజేపీకి కనీసం డిపాజిట్లు కూడా దక్కనీయటంలేదు. అమిత్ షా ఇచ్చే సమాధానం మీదే బీజేపీ భవిష్యత్తు ఆధారపడుంది. మరి ఈ సదస్సు తర్వాత కేంద్రం, బీజేపీ పరిస్ధితి ఎలా మారబోతుందో చూడాలి.