Begin typing your search above and press return to search.

జగన్ కేబినెట్ లో వీరిద్దరికి కీలకశాఖలు

By:  Tupaki Desk   |   8 Jun 2019 10:15 AM GMT
జగన్ కేబినెట్ లో వీరిద్దరికి కీలకశాఖలు
X
ప్రకాశం జిల్లాకు జగన్ కుటుంబానికి అవినాభావ సంబంధం ఉంది. ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్వయంగా జగన్ కు బాబాయ్.. ఇక ఇదే ప్రకాశం జిల్లా కు చెందిన ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా జగన్ కు బంధువు. పైగా జగన్ తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న నాయకుడు. దీంతో బాలినేనికి కీలక శాఖే లభించవచ్చని భావిస్తున్నారు.

బాలినేనికి గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కీలక శాఖలు ఇచ్చారు. వైఎస్ కేబినెట్ లో గనులు, భూగర్భ జలవనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక ఆ తర్వాత రోశయ్య మంత్రివర్గంలో కూడా బాలినేనికి మంత్రి పదవి ఇచ్చారు.

అయితే బాలినేని జగన్ తోపాటు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి వైసీపీలో కొనసాగారు. ఇప్పుడు 2019 ఎన్నికల్లో గెలవడంతో జగన్ .. ఊహించినట్టే బాలినేనికి మంత్రి పదవి ఇచ్చాడు. ఇక జగన్ కు బంధువు, సన్నిహితుడు కావడంతో కీలక శాఖను అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. గతంలో నిర్వహించిన గనులు, భూగర్భ జలవనరులు లేదా రోడ్లు , వ్యవసాయం వంటి ముఖ్యశాఖలు ఇచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.

ఇక ఇదే జిల్లాకు చెందిన ఆదిమలుపు సురేష్ ఎర్రగొండ పాలెం నుంచి ఎమ్మెల్యేగా వరుసగా మూడోసారి గెలిచాడు. ఈయన విద్యాధికుడు. ఐఆర్ ఎస్ గా సేవలందించాడు. ఈయనకు కీలక మైన విద్యాశాఖ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. లేదంటే సాంఘిక సంక్షేమ శాఖ కూడా ఇచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి జగన్ ఏం కేటాయిస్తారో..