Begin typing your search above and press return to search.

ఆగస్టు 15 కాదు.. దసరాకు మాత్రం పక్కానట

By:  Tupaki Desk   |   10 July 2020 9:15 AM IST
ఆగస్టు 15 కాదు.. దసరాకు మాత్రం పక్కానట
X
అదిగదిగో వ్యాక్సిన్ వచ్చేస్తుందంటూ కొద్ది రోజలుగా నడుస్తున్న హడావుడి సంగతి తెలిసిందే. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ కొవాగ్జిన్ వ్యాక్సిన్ ను క్లినికల్ ట్రయల్స్ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వేగవంతంగా పరీక్షలు పూర్తి చేసి ఆగస్టు పదిహేను నాటికి విడుదల చేయాలన్న ఆలోచనలో కేంద్రం ఉండటం తెలిసిందే. అయితే.. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటంతో కాస్త వెనక్కి తగ్గినట్లుగా చెబుతున్నారు. తాజాగా నిర్వహించిన గ్లోబల్ వీక్ 2020లో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు చూస్తే.. వ్యాక్సిన్ కాస్త ఆలస్యంగా వచ్చే అవకాశం ఉందన్న విషయంతో పాటు.. కరోనా టీకా అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించటమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ చేయటంలోనూ భారత్ కీలకభూమిక పోషిస్తుందన్న విషయాన్ని ప్రస్తావించటం గమనార్హం.

గడువు పెట్టి వ్యాక్సిన్ తయారు చేయటం ఏ మాత్రం సరికాదన్న విమర్శలతో పాటు.. ప్రయోగ దశలో ఉన్న వ్యాక్సిన్ ను ఫలానా డేట్ అని చెప్పటం ఎంతవరకు సబబు? అన్న ప్రశ్నలు తలెత్తాయి. దీంతో.. ముందుగా అనుకున్నట్లు ఆగస్టు 15 కాకున్నా.. దసరా నాటికి పూర్తి చేయాలన్న యోచనలో ఉన్నట్లుచెబుతున్నారు.

దేశీయంగా డెవలప్ చేసిన కొవాగ్జిన్.. జైకొవిడ్ వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. అయింతే.. ఈ రెండింటిలో అందరి చూపు కొవాగ్జిన్ మీదనే ఉంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్ ను స్టార్ట్ చేసిన ఈ వ్యాక్సిన్ త్వరగా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. వ్యాక్సిన అనుమతులకు సంబంధించి కీలకమైన పేపర్ వర్క్ ను కాస్తంత షార్ట్ కట్ చేయాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించిన వివరాల్ని పెద్ద ఎత్తున నమోదు చేయాల్సి ఉంటుంది. వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనుమతులు ఇస్తుంటారు. అయితే.. ఈ ప్రక్రియలో పేపర్ వర్క్ ను పరిశీలించటానికే రెండు..మూడు నెలలు పడుతుందని చెబుతున్నారు. అందుకే.. పేపర్ వర్క్ కు సంబంధించిన అంశాల్ని పక్కన పెట్టి.. షార్ట్ కట్ లో వ్యాక్సిన్ విడుదలకు ఓకే చెప్పేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. అయితే.. కీలకమైన వ్యాక్సిన్ కు సంబంధించి ఎలాంటి షార్ట్ కట్స్ పనికి రావన్న సూచన వినిపిస్తోంది. ఏది ఏమైనా..వ్యాక్సిన్ ను మాత్రం దసరాకు తెచ్చేందుకు వీలుగా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.