Begin typing your search above and press return to search.

`ఆ సీఎం` కోసం ర‌క్తంతో లేఖ‌లు.. ఎక్క‌డ‌? ఎందుకిలా?

By:  Tupaki Desk   |   2 Jun 2021 11:00 PM IST
`ఆ సీఎం` కోసం ర‌క్తంతో లేఖ‌లు.. ఎక్క‌డ‌? ఎందుకిలా?
X
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ బీజేపీ రాజ‌కీయాలు వేడెక్కాయి. భ‌గ భ‌గ మండుతున్న సూర్యుణ్ని డామినేట్ చేస్తున్నాయా? అన్న‌ట్టుగా ఈ రాజ‌కీయాలు సాగుతున్నాయి. ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌కు మ‌ద్ద‌తుగా బీజేపీలోని మోడీ వ‌ర్గం ఒక‌వైపు, ఆర్ ఎస్ ఎస్ వ‌ర్గం మ‌రో వైపు చీలిపోయిన‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. దీంతో ఇప్పుడు దేశంలో ప్ర‌తి రాజకీయ నేత దృష్టీ యూపీ పైనే ప‌డింది. దీంతో ఇక్క‌డ అస‌లు ఏం జ‌రుగుతోంది? అనేది చ‌ర్చ నీయాంశంగా మారింది.

వ‌చ్చే ఏడాది ప్రారంభంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వాస్త‌వానికి ఇక్క‌డ అధికారం లోకి వ‌చ్చే పార్టీనే కేంద్రంలోనూ చ‌క్రం తిప్పుతుంద‌నే భావ‌న ఉంది. దీంతో గ‌తంలో ఇక్క‌డ బీజేపీ ప‌ట్టుబ ట్టి.. విజ‌యం ద‌క్కించుకుని.. స్థానిక పార్టీల‌ను మ‌ట్టిక‌రిపించింది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ విజ‌యం ద‌క్కించుకోవాల‌ని.. బీజేపీ భావిస్తోంది. అయితే.. ప్ర‌స్తుతం ఉన్న ముఖ్య‌మంత్రి యోగిపై స‌ర్వ‌త్రా వ్య‌తిరేక‌త పెరిగిపోయింది. ముఖ్యంగా క‌రోనా ను ఆయ‌న స‌మ‌ర్ధంగా ఎదుర్కొన‌లేక పోయార‌నే వాద‌న వినిపిస్తోంది.

ఇక‌, ఈ ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నించిన ఆర్ ఎస్ ఎస్‌.. రాష్ట్రంలో పార్టీ ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దేందుకు రంగంలోకి దిగింది. రేపు గురువారం ఆర్ ఎస్ ఎస్ అదినేత మోహ‌న్ భ‌గ‌వ‌త్‌.. నేరుగా రాష్ట్రంలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ ప‌రిణామాల‌తో అలెర్ట‌యిన‌.. బీజేపీలోని మోడీ, అమిత్ షా, యోగి వ‌ర్గం.. ఒక కూట‌మిగా ఏర్ప‌డింది. ఆర్ ఎస్ ఎస్ చీఫ్ ప‌ర్య‌ట‌న‌ను నేత‌లు వ్య‌తిరేకిస్తున్నారు. యోగి ఆదిత్య నాథ్‌ను ముఖ్య‌మంత్రి పీఠం నుంచి దించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని.. నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు.

మరోవైపు, యోగి ఆదిత్యనాథ్ను సీఎం పదవి నుంచి తొలగించవద్దని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పార్టీ కార్యకర్త సోనూ ఠాకూర్ రక్తంతో లేఖ రాశారు. యోగిని సీఎంగా తొలగిస్తే పార్టీ కార్యాలయం ముందే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. ఒక‌వైపు ఆర్ ఎస్ ఎస్ అధినేత ప‌ర్య‌ట‌న‌, మ‌రో వైపు.. బీజేపీలో యోగిని స‌మ‌ర్థించేవారు.. వ్య‌తిరేకించేవారు గ్రూపులుగా ఏర్ప‌డ‌డం, క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్త‌ల నుంచి బ్ల‌డ్ లెట‌ర్‌లు.. వంటివి యూపీ రాజ‌కీయాల‌ను హీటెక్కించాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. మొత్తానికి మోడీ గ్రూపున‌కు ఆర్ ఎస్ ఎస్ చెక్ పెడుతుందా? అనే విశ్లేష‌ణ‌లు మ‌రింత‌గా ఇక్క‌డి రాజ‌కీయాల‌ను పీక్ స్టేజ్‌కు తీసుకువెళ్ల‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.