Begin typing your search above and press return to search.

మిత్రపక్షాల మధ్య ‘ఉక్కు’ చిచ్చు తప్పదా ?

By:  Tupaki Desk   |   23 Feb 2021 6:00 AM IST
మిత్రపక్షాల మధ్య ‘ఉక్కు’ చిచ్చు తప్పదా ?
X
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయం మిత్రపక్షాల మధ్య చిచ్చు పెడుతుందా ? జనసేన పార్టీ అగ్రనేత నాదెండ్ల మనోహర్ తాజాగా ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తే అదే అనుమానం పెరిగిపోతోంది. ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ఏమి చేయాలనే విషయంలో ఇప్పటికైతే జనసేనలో అయోమయంగ ఉంది. ఎందుకంటే బీజేపీ నేతలకే ఏమి మాట్లాడాలో తెలీక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.

ఉక్కు ప్రైవేటీకరణ విషయాన్ని ప్రస్తావిద్దామని రాష్ట్రం నుండి ఢిల్లీకి వెళ్ళిన బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అండ్ కో ఒక్కళ్ళు కూడా దేకలేదు. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అయితే వీర్రాజు అండ్ కో ను నోరెత్తనీయలేదు. ఇక అమిత్ షా అయితే అసలు ఇంటర్వ్యూనే ఇవ్వలేదు. దాంతో ఏమి చేయాలో అర్ధంకాక చివరకు తలొంచుకుని రాష్ట్రానికి తిరిగొచ్చేశారు.

ఈ విషయాలన్నింటినీ జనసేన గమనిస్తునే ఉంది. అందుకనే యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు నాదెండ్ల మాట్లాడుతు కేంద్రం గనుక తన నిర్ణయం నుండి విత్ డ్రా అవటానికి ఇష్టపడకపోతే జనాభీష్టం మేరకే తమ పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. అంటే అవసరమైతే చివరకు బీజేపీ తో సంబంధాలు తెంచుకునేందుకు కూడా వెనకాడమనే సంకేతాలున్నాయి. మరి ఈ విషయాన్ని బీజేపీ నేతలు గమనించారో లేదో తెలీదు. చూడాలి మిత్రపక్షాల మధ్య ఉక్కు ప్రైవేటీకరణ అంశం ఏ మలుపులు తీసుకుంటుందో.