Begin typing your search above and press return to search.
తెలంగాణలో ఏం జరగనుంది? ఆ మూడు చోట్ల ఎన్నికలు ఓకేసారా?
By: Tupaki Desk | 23 Sept 2020 11:15 AM ISTఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థకు గడువు దగ్గర పడిన నేపథ్యంలో.. స్థానిక ఎన్నికల వేడి షురూ అయ్యింది. అధికార.. విపక్ష నేతలు ఎన్నికలకు సిద్ధమవుతున్న వైనం తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న జీహెచ్ఎంసీ పాలకమండలి పదవీ కాలం ముగియనుంది. అదే సమయంలో.. వరంగ్.. ఖమ్మం కార్పొరేషన్లకు సైతం పదవీ కాలం దగ్గరకు వచ్చేసింది.
ఈ నేపథ్యంలో ఈ మూడు ఎన్నికల్ని ఒకేసారి నిర్వహిస్తారా? వేర్వేగా నిర్వహిస్తారా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. జీహెచ్ఎంసీ పదవీ కాలం ఫిబ్రవరి 10తో ముగిస్తే.. వరంగల్.. ఖమ్మం కార్పొరేషన్లకు మార్చి 14తో గడువు ముగియనుంది. దీంతో నెల రోజుల తేడాతో మూడు ఎన్నికల్ని వేర్వేరుగా నిర్వహిస్తారా? లేదంటే టోకుగా నిర్వహిస్తారా? అన్నది ప్రశ్నగా మారింది.
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీగా ఉండటం.. ఈ మధ్యనే దాని కమిషనర్ గా చిట్ల పార్థసారధి బాధ్యతలు చేపట్టటం.. గ్రేటర్ అధికారులతో భేటీ కావటం తెలిసిందే. తాజాగా గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి వివిధ పనుల్ని వేర్వేరు అధికారుల్ని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదంతా చూస్తుంటే.. జీహెచ్ఎంసీ ఎన్నికల్ని మొదట.. తర్వాత వరంగల్.. ఖమ్మం ఎన్నికల్ని నిర్వహించే అవకాశం ఉందంటున్నారు.
ప్రస్తుతం నడుస్తున్న కరోనా వేళ.. ఒకేసారి మూడు చోట్ల ఎన్నికల్ని నిర్వహించిన పక్షంలో ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో పాటు.. దేని మీదా ఫోకస్ పెట్టే అవకాశం తక్కువగా ఉంటుంది. అదే సమయంలో.. త్వరలో జరిగే ఎన్నికల్ని ఈవీఎంలతో నిర్వహిస్తారా? లేదంటే బ్యాలెట్ పత్రాలతో నిర్వహిస్తారా? అన్న అంశంపైనా క్లారిటీ రావటం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల్ని వేర్వేరుగా నిర్వహించేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతుందన్న మాట వినిపిస్తోంది.
హైదరాబాద్ మహానగర సంస్థ ఎన్నికలతో పాటు ఖమ్మం.. వరంగల్ కార్పొరేషన్లకు మాత్రమే కాదు.. సిద్దిపేటతో అచ్చంపేట.. నకిరేకల్ లాంటి పట్టణాల స్థానిక ఎన్నికల్ని వచ్చే ఏడాది పూర్తి చేయాల్సి ఉంటుంది. వరుసగా వచ్చే ఎన్నికల్ని టోకుగా కంటే కూడా బ్యాక్ టు బ్యాక్ లెక్కన ఎన్నికల్ని నిర్వహించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.