Begin typing your search above and press return to search.
వ్యాక్సిన్ లేకుండానే డిసెంబరు నాటికి కరోనా తగ్గిపోనుందా?
By: Tupaki Desk | 21 Aug 2020 10:30 AM ISTప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా దెబ్బకు కిందామీదా పడిపోతున్నారు. కోట్లాది మంది ఈ వైరస్ కు చెక్ చెప్పే వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న వైనం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఊహించని రీతిలో.. సీరో సంస్థ విడుదల చేసిన ఒక రిపోర్టు ఇప్పుడు సంచలంగా మారింది. దీనికి కారణం.. ఈ సర్వే రిపోర్టులో పేర్కొన్న అంశాలే. సదరు సంస్థ అధ్యయనం ప్రకారం వ్యాక్సిన్ అవసరం లేకుండానే కరోనా ఖతమయ్యే అవకాశం ఉన్నట్లుగా చెబుతోంది.
ఏదో మాట వరసకు చెప్పినట్లు కాకుండా.. తాము చెప్పే మాటల వెనకున్న లాజిక్ ఏమిటో చెప్పే ప్రయత్నం చేస్తోంది. వ్యాక్సిన్ అవసరం లేకుండా.. ఈ మహమ్మారి ఎలా కంట్రోల్ అవుతుందన్న ప్రశ్నకు వారి సమాధానం ఏమంటే.. గతంలో కేసులు భారీగా నమోదైన ప్రాంతాల్లో యాంటీబాడీలు పెరుగుతున్నాయని.. పాక్షికంగా హెర్డ్ ఇమ్యూనిటీని సాధించినట్లు గుర్తించారు. దీంతో.. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగి.. కేసులు నమోదు తగ్గిపోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
మరింత వివరంగా.. అర్థమయ్యేలా చెప్పాలంటే.. ఈసంస్థ రూపొందించిన సర్వేలో సెప్టెంబరు రెండు నాటికి దేశంలో 7.87 లక్షల కేసులు యాక్టివ్ గా ఉంటాయి. అప్పటి నుంచి సెప్టెంబరు 16 వరకు కేసుల సంఖ్య స్థిరంగా ఉంటుందని.. ఆ తర్వాత నుంచి కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు. ఇప్పటివరకువేసిన అంచనాలు నిజమైన పక్షంలో డిసెంబరు మూడు నాటికి కేసుల సంఖ్య పూర్తిగా తగ్గిపోతుందట. అదే జరిగితే.. కరోనాకు వ్యాక్సిన్ అవసరం ఇప్పటికిప్పుడు లేనట్లే కదా?
దేశం విషయం ఇలా ఉంటే.. తెలుగు రాష్ట్రాల్లో డిసెంబరు కంటే ముందే.. కేసుల తీవ్రత తగ్గిపోవటం ఖాయమంటున్నారు. అదెలా అంటే.. తెలంగాణలో ఆగస్టు 15 నాటికే కేసుల సంఖ్య పతాక స్థాయికి చేరుకుందని.. అక్టోబరు 17 నాటికి పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటుననారు. ఏపీ విషయానికి వస్తే.. ఈ నెల 23 నాటికి పతాక స్థాయికి చేరుకొని.. అక్టోబరు 28 నాటికి వైరస్ పూర్తిగా తగ్గుముఖం పట్టే వీలుందని చెబుతున్నారు. అదే జరిగితే.. వ్యాక్సిన్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. హెర్డ్ ఇమ్యునిటీని సాధిస్తే.. పరిస్థితుల్లో అనూహ్య మార్పులకు కారణమవుతుందని చెప్పక తప్పదు.