Begin typing your search above and press return to search.
అమరావతి రాజధానికి కేంద్రం నిధులు ఇస్తుందా?
By: Tupaki Desk | 3 April 2022 6:00 PM ISTఏపీకి ఈ రోజుకీ రాజధాని లేదు. ఇది బట్టతల ఎంత స్పష్టంగా కనిపిస్తుందో అంతే సులువుగా లోకం ఎరిగిన విషయం. ఏపీలో 2014 ఎన్నికల ప్రచార వేళ నాటి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ అయితే ఏపీకి ఢిల్లీని తలదన్నే రాజధానిని కట్టించి ఇచ్చే బాధ్యత తనదని చెప్పుకున్నారు. లక్కీగా కేంద్రంలో మోడీ, ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు.
ఇంకేముంది, ఏపీకి బ్రహ్మాండమైన రాజధాని వచ్చి తీరుతుందని అంతా ఆశించారు. కానీ కేంద్రం రాజధాని విషయంలో పెద్దగా పట్టించుకోలేదు. మరో వైపు చంద్రబాబు కూడా దీన్ని తనకు అనుకూలంగా చేసుకున్నారు. కేంద్రం నియమించిన శివరామక్రిష్ణన్ కమిటీ నివేదికను పక్కన పెట్టి తాను అనుకున్న కమిటీతో ప్రపంచ రాజధాని దిశగా అడుగులు వేశారు.
అమరావతి పేరిట వేలాది ఎకరాల భూములను సేకరించారు. అయితే అక్కడ మౌలిక సదుపాయల కల్పనకే లక్షల కోట్లు అవుతుందని నాటి సర్కారే లెక్కలు వేసింది. ఈ లెక్కలు ఇలా ఉండగానే డిజైన్ల పేరిట గత సర్కార్ పుణ్యకాలం అంతా గడిపేసి గద్దె దిగిపోయింది. ఇక్కడ ఇంత జరుగుతున్నా కేంద్రం మాత్రం మౌన ప్రేక్షన పాత్ర పోషించింది అనే చెప్పాలి.
నాడు అంటే 2015 అక్టోబర్ నెలలో జరిగిన అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ప్రధాని కచ్చితమైన హామీ మాత్రం ఇవ్వలేదు. మరో వైపు ఏపీ సర్కార్ అతి చేస్తోంది అని కేంద్రానికి తెలుసు. ఇంత పెద్ద ఎత్తున భూముల సేకరణ చేస్తే మేము నిధులను ఇవ్వలేమని నాడు ఏ కోశానా చెప్పలేదు.
పైగా తాము ఎన్ని నిధులు ఇస్తామన్నది కూడా క్లారిటీగా ఏ రోజూ చెప్పలేదు. ఇక కేంద్రం వైఖరి చూసిన చంద్రబాబు స్వదేశీ విదేశీ రుణాలు, సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీం లాంటి వాటి మీద ఆధారపడాలనుకున్నారు. అవి కూడా అలవి కానీ కండిషన్లతోనే. మొత్తానికి చంద్రబాబు మాజీ అయ్యాక జగన్ వచ్చాక అమరావతి కధ మరో మలుపు తిరిగింది.
మూడు రాజధానుల పేరిట అమరావతికి కొత్త ట్విస్టులు ఇస్తూ మూడేళ్ళు గడిపేసిన జగన్ అయినా రాజధానికి ఇన్ని లక్షల నిధులు అవుతాయి, మీరు ఇస్తారా లేదా అని కేంద్రాన్ని అడగలేదు. పైగా అంత భారం తమ నెత్తిన పెట్టి చంద్రబాబు వెళ్లారని ఆయన మీద విమర్శలు చేశారు.
దానికి బదులుగా మూడు రాజధానులకు తెరతీశారు. ఒక రాజధానికే నిధులు లేవు అంటే మూడు మాటేంటి అన్న చర్చ ఉన్నా వైసీపీ పెద్దలు ఎక్కడా తగ్గలేదు. ఈ నేపధ్యంలో ఇపుడు అఫీషియల్ గా హై కోర్టుకు వైసీపీ సర్కార్ పెద్ద ఎత్తున నిధులు అమరావతి రాజధాని నిర్మాణానికి అవుతాయని పేర్కొంది.
దీని మీద బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఒక లాజిక్ పాయింట్ తీశార్. అది జగన్ కే కాదు, చంద్రబాబుకు కూడా తగిలేలా ఉంది. అమరావతి రాజధాని నిధుల గురించి కేంద్రానికి ఎపుడైనా లేఖ రాశారా జగన్ అంటూ ఆయన అడిగిన దానికి జవాబు రెండు ప్రభుత్వాల వద్ద లేదు. మొత్తానికి అమరావతి క్రెడిట్ మొత్తం తనకే రావాలని చంద్రబాబు పడిన తాపత్రయంతో కేంద్రానికి భారం తగ్గిస్తే మూడు రాజధానుల కొత్త ఆలోచనలతో బీజేపీ ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేయకుండా కధ నడిపించాలని జగన్ అనుకున్నారు.
ఈ టోటల్ ఎపిసోడ్ లో చూస్తే ఏపీకి రాజధాని అన్నది లేకుండా పోయింది. మరి ఒక తల్లిగా కేంద్రం నిధులు ఇవ్వాలి కదా. విభజన వద్దంటున్నా చేసిన కేంద్ర పెద్దలే రాజధాని నిర్మించాలి కదా. ఆఖరుకు మోడీ ప్రధాని అభ్యర్ధిగా చెప్పిన మాట ఇచ్చిన హామీ మేరకు ఢిల్లీని తలదన్నే రాజధాని కాకపోయినా ఒక రాజధాని అంటూ ఏపీకి నిర్మించాలిగా.
మరి బీజేపీ వారు ఈ రోజు గడుసుగా మమ్మల్ని ఎందుకు అడగడం లేదూ అని నిందిస్తున్నారు అంటే తప్పు వారిదా ఏపీ పాలకులదా. సులువుగా చెప్పాలంటే క్రెడిట్ పాలిటిక్స్ కోసం చేసిన రాజధాని రచ్చకు ఇదంతా ఒక అతి పెద్ద ఉదాహరణగా చెప్పుకోవాలేమో. అయినా వింతేమిటంటే ఏపీలో పోలవరం సహా చాలా వాటికి అడిగిన దానికే నిధులు పెద్దగా విదిలించింది లేదు. రాజధానికి నిధులు అంటే కేంద్రం ఇస్తుందా. ఇది మిలియన్ డాలర్ ప్రశ్న కాదు, జవాబు బహు సులువు.